Yadadri: యాదాద్రిలో భక్తుల ఆందోళన.. సదుపాయాలు లేనప్పుడు దర్శనాలు ఎందుకంటూ ఫైర్!

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూ.1200 కోట్లతో పునర్నింర్మించిన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతోంది.

Update: 2022-04-04 10:50 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూ.1200 కోట్లతో పునర్నింర్మించిన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతోంది. స్వామివారి నిజరూప దర్శనం కోసం భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచి తరలివస్తున్నారు. కానీ, భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో భక్తులందరూ ఆలయ పరిసరాల్లో వారి ఇబ్బందులను తెలియజేస్తూ నిరసన తెలిపిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

వేసవి కారణంగా భారీగా ఉష్ణోగ్రతలు పెరిగే సరికి కనీసం మంచి నీరు కూడా అందించడం లేదని చిన్న, పెద్దా ఇబ్బందులు పడుతున్నామని ఆలయ సిబ్బందిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యూలైన్లలో కనీసం ఫ్యాన్లు కూడా లేకపోవడం వల్ల ఎండవేడికి పిల్లలు ఉక్కిరిబిక్కిరి అయ్యారని వాపోయారు. సదుపాయాలు లేనప్పుడు దర్శనాలు ఎందుకు కల్పించారంటూ.. ఆలయ ప్రాంగణంలో కనిపించిన అధికారులను ప్రశ్నించారు.

Tags:    

Similar News