'వడ్డీ రేట్లు పెరిగినా ఇళ్ల అమ్మకాలకు ఢోకా లేదు'!

ముంబై: గత కొన్ని నెలలుగా ముడిసరుకు ధరలు పెరగడం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) రెపో రేటును రెండుసార్లు పెంచిన సంగతి తెలిసిందే.

Update: 2022-07-10 16:51 GMT

ముంబై: గత కొన్ని నెలలుగా ముడిసరుకు ధరలు పెరగడం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) రెపో రేటును రెండుసార్లు పెంచిన సంగతి తెలిసిందే. అయితే, దీనివల్ల రియల్ ఎస్టేట్ పరిశ్రమలో అమ్మకాలపై ఎక్కువ ప్రభావం ఉండదని ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్లు, బ్రోకరేజ్ సంస్థలు అభిప్రాయపడ్డాయి. బడ్జెట్ ధరలో ఉండే ఇళ్ల అమ్మకాలకు రికార్డు స్థాయిలో డిమాండ్ ఉండటంతో నెలవారీగా వృద్ధి సాధిస్తున్నాయని, ఇది ముఖ్యంగా హైబ్రిడ్ పని విధానం, వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి పరిణామాలతో సానుకూలంగా ఉందని పరిశ్రమ నిపుణులు పేర్కొన్నారు.

కాబట్టి ఈ స్థాయి డిమాండ్ ఉన్న నేపథ్యంలో స్వల్ప వడ్డీ రేట్ల పెరుగుదల పరిశ్రమలో ఇళ్ల అమ్మకాలను ఎక్కువ ప్రభావితం చేయకపోవచ్చని తెలిపారు. దేశీయ రియల్ ఎస్టేట్ పరిశ్రమ చాలా కాలంగా ప్రతికూలతను ఎదుర్కొంటోంది. అయితే, ఇటీవలే తిరిగి పుంజుకుంటోంది. ఇళ్ల కొనుగోలుదారుల నుంచి సానుకూల సెంటిమెంట్ కొనసాగుతున్న తరుణంలో అమ్మకాలు మెరుగ్గా ఉంటాయని గోద్రేజ్ ప్రాపర్టీస్ మేనేజింగ్ డైరెక్టర్ మోహిత్ మల్హోత్రా అన్నారు. గత రెండేళ్ల తర్వాత డిమాండ్ మెరుగైన రికవరీ కనిపించినప్పటికీ ఈసారి ధరలు స్థిరంగా ఉన్నాయి. ముఖ్యంగా బడ్జెట్ ధరల ఇళ్ల అమ్మకాలపై ప్రభావం తక్కువగానే ఉందని మోతీలాల్ ఓస్వాల్ వెల్లడించింది.

Tags:    

Similar News