Dondakaya Pachadi:టేస్టీ టేస్టీ దొండకాయ నిల్వ పచ్చడి..
దొండకాయ తింటే ఆరోగ్యానికి మంచిది.
దిశ, వెబ్‌డెస్క్: దొండకాయ తింటే ఆరోగ్యానికి మంచిది. పచ్చి దొండకాయలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.అలాగే విటమిన్ B2, విటమిన్ B1, ఫైబర్, కాల్షియం, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. దొండకాయ రక్తంలో చక్కెర స్థాయిలను(Blood Sugar Level) తగ్గించడంలో కూడా మేలు చేస్తుంది. పొట్టలో కొవ్వు పెరిగితే దొండకాయ తినవచ్చు. అలాగే గుండె సమస్యలు(heart problems), కడుపు సంబంధిత సమస్యలకు పచ్చి దొండకాయను తింటే మంచిది. అయితే దొండకాయతో టేస్టీ టేస్టీ పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఒకసారి చేసుకుని రెండు నెలల పాటు నిల్వ ఉంచుకోవచ్చు. తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం..
దొండకాయ నిల్వ పచ్చడి రెసిపీకి కావలసిన పదార్థాలు
మిరియాల పొడి - మూడు స్పూన్లు, సరిపడ ఉప్పు, అరకిలో దొండకాయలు, ఆవాలు మూడు స్ఫూన్లు, సరిపడ కారం, ఆయిల్, మెంతి గింజలు, నిమ్మరసం, జీలకర్ర, శనగపప్పు తీసుకోవాలి.
దొండకాయ నిల్వ పచ్చడి విధానం..
ముందుగా దొండకాయల్ని నిలువుగా కట్ చేసుకుని.. వీటిలో వెల్లుల్లి, రుచికి సరిపడ కారం, ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత మెంతులు, జీలకర్ర పొడి, వేయించిన మూడు స్పూన్ల ఆవాల పొడి వేసుకోవాలి. అలాగే కాస్త నిమ్మరసం వేయాలి. ఇప్పుడు కడాయి తీసుకుని ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, శనగపప్పు వేసి వేయించాలి. తర్వాత ఈ పోపును దొండకాయ మిశ్రమంలో వేసి మొత్తం బాగా కలపాలి. ఈ మిశ్రమాన్నంతా ఒక గాజు సీసాలో పెట్టుకోవాలి. రెండ్రోజుల తర్వాత పదను లేని స్ఫూన్ తో కలుపుకోవాలి. అంతే దొండకాయ నిల్వ పచ్చడి తయారైనట్లే. రెండు నెలల పాటు టేస్ట్ పోకుండా రుచిగా ఉంటుంది.
గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు.కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.