రేపటి తరానికి అన్ని తానై.. పాఠశాల వసతుల కల్పన

దిశ, గుండాల: గుండాల మండలంలోని బండ కొత్తపల్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల.. latest telugu news..

Update: 2022-03-19 13:49 GMT

దిశ, గుండాల: గుండాల మండలంలోని బండ కొత్తపల్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల విద్యార్థులకు గుండాల మండల వైస్ ఎంపీపీ మహేశ్వరం మహేందర్ రెడ్డి అన్ని తానై పాఠశాలకు కావాల్సిన అన్ని మౌలిక వసతులను తన స్వంత ఖర్చులతో విద్యార్థులకు అందిస్తున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం పుస్తకాలు, అలాగే ఒక నీళ్ల ట్యాంకరు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు త్రాగునీరు కోసం కొత్త వాటర్ ప్లాంట్‌ను త్వరలో ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. తన పరిధిలో ఉన్న పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అలాగే స్కూల్ ని పర్యవేక్షించారు.

ఈ క్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీరంగం నర్సయ్య వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు గోపాల్ దాస్ వెంకన్న, ఆంజనేయులు, ఉపాధ్యాయులు బిక్షమయ్య, నరేష్, రొసెట్టి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాల మీద మా రేపటి తరాల విద్యార్థుల మీద ప్రత్యేక చొరవ చూపిస్తున్న వైస్ ఎంపీపీ మహేశ్వరం మహేందర్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపిన గ్రామ ప్రజలు.

Tags:    

Similar News