సీపీఐ నారాయణ ఇంట్లో తీవ్ర విషాదం.. శోకసంద్రంలో పార్టీ శ్రేణులు

దిశ, వెబ్‌డెస్క్: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నారాయణ సతీమణి వసుమతి కన్నుమూశారు.

Update: 2022-04-14 12:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఇంట్లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. నారాయణ సతీమణి వసుమతి దేవీ (65) గురువారం సాయంత్రం కన్నుమూశారు. వసుమతి దేవి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆమె గుండెపోటుకు గురవ్వడంతో తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. భార్య మరణంతో సీపీఐ నారాయణ కన్నీటి పర్యంతమయ్యారు. సోషల్ మీడియా వేదికగా పలువురు నేతలు, సినీ ప్రముఖులు వసుమతీదేవికి అశ్రునివాళులర్పిస్తున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు నగరి నియోజకవర్గం ఐనంబాకం గ్రామంలో అంత్యక్రియలు జరగనున్నాయి..



 


Tags:    

Similar News