ఆ నిర్మాణంలో ఇసుక స్థానంలో డస్ట్‌.. ఇదేంటని ప్రశ్నిస్తే..!

దిశ, కేసముద్రం: ఒకవైపు సీఎం కేసీఆర్ రాష్ట్రాభివృద్ధి కోసం ఆహర్నిశలు శ్రమిస్తుంటే- latest Telugu news

Update: 2022-03-31 16:41 GMT

దిశ, కేసముద్రం: ఒకవైపు సీఎం కేసీఆర్ రాష్ట్రాభివృద్ధి కోసం ఆహర్నిశలు శ్రమిస్తుంటే.. మరో వైపు కింది స్థాయి అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో ప్రజాధనం వృధా చేస్తున్నారు. మహబూబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని మహమూద్ పట్నం గ్రామానికి చెందిన పలువురు గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు గ్రామంలో సీసీ రోడ్డు వేయడం కోసం కాంట్ట్రాక్టర్లు సైడ్ కాలువలను పూడ్చేసి రోడ్డు వేశారు. సీసీ రోడ్డు నిర్మాణంలో సైతం సరైన ప్రమాణాలు పాటించకుండా వేశారు. 50 శాతం ఇసుక వాడాల్సిన స్థానంలో 80 శాతం డస్ట్‌ వాడుతున్నారు. ఇలా ఎందుకు వాడుతున్నారని ప్రశ్నించగా అలాంటిదేమి లేదని జవాబు చెపుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఏ అధికారి కూడా స్పందించడం లేదని గ్రామస్తులు తెలిపారు.

Tags:    

Similar News