కాంగ్రెస్‌కు భారీ షాక్.. గులాబీ కండువా కప్పుకుంటున్న నేతలు

దిశ ప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ మంచి ఫలితాలు.. Latest Telugu News..

Update: 2022-03-20 08:26 GMT

దిశ ప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ మంచి ఫలితాలు ఇస్తున్నది. ఆకర్ష్‌‌‌లో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు వరుస కట్టి టీఆర్ఎస్‌లో చేరిపోతున్నారు. దీనితో స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి అయోమయంలో పడ్డారు. నియోజకవర్గంలో సంగారెడ్ది, సదాశివపేట, కొండాపూర్, కంది మండలాలు, సంగారెడ్ది, సదాశివపేట మున్సిపాలిటీలు ఉన్నాయి. కాగా సదాశివపేటలో కాంగ్రెస్‌ను ఖాళీ చేసే లక్ష్యంగా టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పావులు కదుపుతున్నారు.

ఇందులో బాగంగానే ఇప్పటికే సదాశివపేట ఎంపీపీ తొంట యాదమ్మ, వెల్టూర్ సర్పంచ్ పబ్బతి లక్ష్మారెడ్డి, నందికంది సర్పంచ్ కుందెన రాజు, పెద్దాపూర్ సర్పంచ్ బోయిని శ్రీనివాస్, కోనాపూర్ సర్పంచ్ శోభారాణి సంగమేశ్వర్, అంకెనపల్లి సర్పంచ్ విజయలక్ష్మి భాను, నాగ్సాన్పల్లి సర్పంచ్ లక్ష్మి శేఖర్, వెల్టూర్ మాజీ సర్పంచ్ నరసింహ గౌడ్‌లు మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఆదివారం రోజున సదాశివపేట వార్డు కౌన్సిలర్లు సాతాని లలిత శ్రీశైలం, శ్రీనివాస్ నాయక్ లతో పాటు కంది మండలం కవలంపేట సర్పంచ్ షఫీలు హైదరాబాద్‌లో మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరిపోయారు.


కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, కంది జెడ్పీటీసీ కొండల్ రెడ్డి, సదాశివపేట మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, కౌన్సిలర్లు పిల్లోడి విశ్వనాథం, పులిమామిడి రాజు, ఆకుల శివకుమార్, పిల్లిగుండ్ల వీరేశం, పార్టీ కంది మండల అధ్యక్షుడు మధుసూధన్ రెడ్డి, సంగారెడ్డి మండల అధ్యక్షులు చక్రపాణి , మాజీ అధ్యక్షుడు అశోక్ , ఆరుట్ల మాజీ సర్పంచ్ రాంరెడ్డి సదాశివపేట టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

పరేషాన్ లో జగ్గారెడ్డి

నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, సన్నిహితులు వరుసపెట్టి టీఆర్ఎస్‌లో చేరుతుండడంతో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పరేషాన్‌లో పడ్డారు. కార్యకర్తల్లో జోష్ నింపడం కోసం ఇటీవల ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఓ వైపు ఆయన నియజకవర్గ పర్యటనలు కొనసాగుతుండగానే మరో వైపు పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్‌లో చేరిపోవడాని ఆయన జీర్ణించుకోలేక పోతున్నారు. సంగారెడ్డిలో లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తానని చెప్పిన ఆయన ఆ ప్రోగ్రాం గురించి మాట్లాడం లేదని సన్నిహితులు అంటున్నారు.

జగ్గారెడ్డి ఇక ఒంటరే..

సంగారెడ్డి నియోజకవర్గంలో ఇక కాంగ్రెస్ మాటే లేదని మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ ఎద్దేవా చేస్తున్నారు. సదాశివపేట ఖాళీ అయిపోయింది. త్వరలోనే సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ ఖతం కానుందని జోస్యం చెప్పారు. జగ్గారెడ్డి అన్ని డ్రామాలు ఆడిన సంగారెడ్డిలో కాంగ్రెస్ కు ఇక నూకలు చెల్లినట్లేనని చింతా ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News