YSRCP Plenary: నా గుండె బెదరలేదు.. ప్లీనరీలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

CM YS Jagan Emotional Speech In YSRCP Plenary| వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. పార్టీ జెండాను ఆవిష్కరించి ప్లీనరీని ప్రారంభించారు. అనంతరం ప్లీనరీ వేదికపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి సీఎం జగన్‌ నివాళులర్పించారు.

Update: 2022-07-08 06:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: CM YS Jagan Emotional Speech In YSRCP Plenary| వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. పార్టీ జెండాను ఆవిష్కరించి ప్లీనరీని ప్రారంభించారు. అనంతరం ప్లీనరీ వేదికపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి సీఎం జగన్‌ నివాళులర్పించారు. అనంతరం జగన్ మాట్లాడుతూ.. 13 ఏళ్ల క్రితం సంఘర్షణ మొదలైందని, 13 ఏళ్లుగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామని తెలిపారు. అవమానాల్ని భరించి, కష్టాల్ని భరించి తనతో ప్రయాణించిన అందరికీ సెల్యూట్ చేశారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే 95 శాతం మ్యానిఫెస్టోను అమలు చేశామని అన్నారు. ఎన్నో వ్యవస్థలు కత్తి పట్టినా, ఎంతో మంది కుట్రలు చేసినా, నా గుండె బెదరలేదు, నా సంకల్పం చెదరలేదని వ్యాఖ్యానించారు. ఏపీలో ఈ జగమంత కుటుంబం నా చేయి ఏనాడూ వీడలేదని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గతంలో ఎన్నడు జరుగని విధంగా 151 మంది ఎమ్మెల్యేలతో నన్ను ఆశీర్వదించారని ఎమోషనల్ అయ్యారు. 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను కొన్న వారిని మూడు ఎంపీ సీట్లకు, 23 ఎమ్మెల్యే సీట్లకు పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. అధికారం అంటే అహంకారం కాదని, మ్యానిఫెస్టోను చూపించడానికే టీడీపీ భయపడిందని అన్నారు. మ్యానిఫెస్టోను భగవద్గీతలా, ఖురాన్‌లా, బైబిల్‌లా తాము భావించామని వెల్లడించారు. కాగా, ప్లీనరీ సమావేశాలకు వైఎస్‌ విజయమ్మ హాజరయ్యారు. పండగలా వైఎస్సార్‌సీపీ ప్లీనరీ జరుగుతోంది. 

Tags:    

Similar News