Citadel Honey Bunny: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న సిటాడెల్ సిరీస్ ట్రైలర్.. గన్స్ పట్టుకొని సామ్ యాక్షన్ అదరగొట్టేసిందిగా!

రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన సిటాడెల్ వెబ్ సిరీస్ కోసం ప్రేక్షకులంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Update: 2024-10-15 09:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన సిటాడెల్ వెబ్ సిరీస్ కోసం ప్రేక్షకులంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ సిరీస్‌లో క్యూటీ సమంత అండ్ వరుణ్ ధావన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన టీజర్ విడుదలై జనాల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇవాళ (అక్టోబరు 15) సిటాడెల్ నుంచి ట్రైలర్ రిలీజ్ అవ్వనుంని సామ్ నిన్న సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కాగా ఈ మేరకు తాజాగా ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్.

ట్రైలర్ మొత్తం ఫుల్ యాక్షన్‌తో ప్రేక్షకుల అంచనాలను రీచ్ అయ్యింది. స్టార్ నటి సమంత గన్స్ పట్టుకుని యాక్టింగ్ అదరగొట్టిందనుకోండి. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ఇక సామ్ ఫ్యాన్స్ కుదురుగా ఉంటారా? కామెంట్లతో నెట్టింట హంగామా స్టార్ట్ చేశారు. సిటాడెల్ నవంబర్ 7 వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవ్వనుంది. తెలుగుతో పాటు ఈ సిరీస్ మరికొన్ని భాషల్లో కూడా జనాల్ని అలరించనుంది. ఇక సమంత అదిరిపోయే ఫర్మామెన్స్‌తో ట్రైలర్ నెట్టింట షేక్ చేస్తోంది.  

Full View
Tags:    

Similar News