లక్కీ ఛాన్స్ కొట్టేసిన యంగ్ బ్యూటీ.. చిరు 154లో ఆయన సరసన

దిశ, సినిమా: తమిళ యంగ్ బ్యూటీ నివేతా పేత్‌రాజ్ తెలుగులో పాగల్, రెడ్ సినిమాల్లో నటించి..latest telugu news

Update: 2022-03-17 07:35 GMT

దిశ, సినిమా: తమిళ యంగ్ బ్యూటీ నివేతా పేత్‌రాజ్ తెలుగులో పాగల్, రెడ్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు అలా వైకుంఠపురంలో కీ రోల్ పోషించిన ఆమె అందం, అభినయంతో ప్రేక్షకులను తన వైపు తిప్పుకుంది. ఈ క్రమంలోనే తాజాగా మరో భారీ ఆఫర్ చేజిక్కుచ్చుకున్నట్లు తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్ బాబీ మెగాస్టార్ చిరంజీవి కాంబోలో వస్తున్న చిరు 154వ సినిమాలో నటించే అవకాశం వచ్చినట్లు సమాచారం. అయితే ఈ మూవీలో చిరంజీవి సోదరుడిగా ప్రత్యేకపాత్రలో నటించనున్న రవితేజకు జోడిగా నివేతా పేతురాజ్‌ను ఎంపిక చేసినట్లు టాక్ నడుస్తోంది. ఇక వాల్తేర్ షిప్‌యార్డ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో చిరు సరసన శృతి హాసన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

Full View

Tags:    

Similar News

Mr. మొహ‌మాటం.!