Chiranjeevi: మెగా ఫ్యామిలీలో శుభకార్యం.. గుడ్ న్యూస్ ప్రకటించబోతున్న చిరంజీవి!
మెగా ఫ్యామిలీలో చివరగా జరిగిన శుభకార్యం అంటే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej), లావణ్య(Lavanya Tripathi)ల పెళ్లి అని అందరికీ తెలిసిందే.
దిశ, సినిమా: మెగా ఫ్యామిలీలో చివరగా జరిగిన శుభకార్యం అంటే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej), లావణ్య(Lavanya Tripathi)ల పెళ్లి అని అందరికీ తెలిసిందే. వీరిద్దరు ప్రేమించి పెద్దలను ఒప్పించి మరీ గత ఏడాది నవంబర్ 1న ఇటలీ(Italy)లో గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. ఇక వీరి పెళ్లి జరిగి కూడా ఏడాది పూర్తి అయింది. రీసెంట్‌గానే వీరికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే గత కొద్ది రోజుల నుంచి లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) ప్రెగ్నెంట్ అంటూ పలు వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. కానీ దీని గురించి మెగా ఫ్యామిలీ కానీ లావణ్య స్పందించి క్లారిటీ ఇవ్వలేదు.
ఇదిలా ఉంటే.. తాజాగా, మెగా ఫ్యామిలీ(Mega Family)కి సంబంధించిన ఓ వార్త నెట్టింట ట్రెండ్ అవుతోంది. మెగా ఫ్యామిలీలో ఓ శుభకార్యం జరగబోతున్నట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) మనవరాలు శ్రీజ (Sreeja Konidela)కూతురు నివృత్తి హాఫ్ సారీ ఫంక్షన్ చేయడానికి మెగా ఫ్యామిలీ డిసైడ్ అయినట్లు టాక్. త్వరలోనే మెగా ఫ్యామిలీ అంతా కూడా ఈ హాఫ్ సారీ ఫంక్షన్(Half Saree function) కి అటెండ్ కాబోతుందని తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఈ వార్త బాగా హల్ చల్ చేస్తుంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
కాగా, చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మొదటి భర్త శిరీష్ భరద్వాజ్(Shirish Bhardwaj)లకు పుట్టిన బిడ్డే ఈ నివృత్తి(Nivruthi). ఈ పాప పుట్టిన తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక శ్రీజ కల్యాణ్ దేవ్‌కు పెళ్లి చేసుకుంది. వీరికి కూడా నిష్క(Nishka) అనే పాప పుట్టింది. ఇక వీరిద్దరి మధ్య కూడా మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయినట్లు గతంలో వార్తలు వచ్చాయి. కానీ అధికారిక ప్రకటన మాత్రం విడుదల కాలేదు. ఇక శ్రీజ మాత్రం తన ఇద్దరు కూతుళ్లతో కలిసి మెగాస్టార్ చిరంజీవి ఇంట్లోనే ఉంటోంది.