రవిచంద్ర ఆరోగ్యంపై ముఖ్యమంత్రి ఆరా..!
తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్
దిశ ప్రతినిధి, వరంగల్ : తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఢిల్లీలో చేపట్టిన నిరసన దీక్షలో ఆ పార్టీ రాష్ట్ర నేత వద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు. ఇటీవల కాలికి గాయం కావడంతో ఆయన తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అయినా పార్టీ అధినేత ఆదేశాల మేరకు కాలినొప్పితోనే ఢిల్లీకి చేరుకున్నారు. ముందుగా ఢిల్లీ తెలంగాణ భవన్ వద్ద సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈసందర్భంగా రవిచంద్ర కాలిగాయం, ఆరోగ్యంపై ముఖ్యమంత్రి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, శాసన సభ్యులు సండ్ర వెంకట వీరయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డితో కలిసి వరి కంకులు పట్టుకుని ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించే సభ ప్రాంగణానికి చేరుకున్నారు. అంతకు ముందు ఉదయం ఎంపీ నామా నాగేశ్వరరావు ఆహ్వానం మేరకు ఢిల్లీలోని ఆయన నివాసానికి తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాష్‌తో కలిసి వెళ్లి ఆతిథ్యం స్వీకరించారు.