అంతుచిక్కని వైరస్ తో కోళ్లు మృతి
దిశ, నర్సంపేట : వరంగల్ జిల్లా నెక్కొండ మండలం లో అంతుచిక్కని వ్యాధితో వందల సంఖ్యలో కోళ్లు latest telugu news..
దిశ, నర్సంపేట : వరంగల్ జిల్లా నెక్కొండ మండలం లో అంతుచిక్కని వ్యాధితో వందల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నెక్కొండ మండలంలోని మడిపెల్లి గ్రామంలోని ఓ పౌల్ట్రీ ఫామ్ లో వందల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. మండలంలోని మడిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని హరిచంద్రు తండాలో అంతుచిక్కని వైరస్ తో వందల కోళ్లు మృతి చెందాయి. మడిపల్లి గ్రామపంచాయితీకి పరిధిలోని తేజావత్ మురళీ గత మూడు సంవత్సరాలుగా ఉపాధి కోసం తన సొంత వ్యవసాయ భూమిలో పౌల్ట్రీ ఫామ్ ఏర్పాటు చేసుకున్నాడు.
ఇదిలా ఉండగా.. ఇటీవల ఓ ప్రముఖ కంపెనీ నుండి 11,300 పిల్లలను తీసుకొచ్చాడు. గత రెండు రోజులుగా అంతుచిక్కని వైరస్ తో కోళ్లు మృతి చెందుతున్నాయి. ఐతే మెడిసిన్ వేసినప్పటికీ ఇంకా కోళ్లు చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఉపాధి కోసం ఫామ్ ఏర్పాటు చేస్తే లక్షల్లో నష్టం వచ్చిందని యువ రైతు ఆవేదన చెందుతున్నారు. కాగా కోళ్లపై కంపెనీ వారికి బీమా ఉన్నప్పటికీ, కోళ్ల పై పౌల్ట్రీ ఫామ్ నడిపే యజమానులకు బీమా లేకపోవడం గమనార్హం.