మీ పుత్రులను యుద్ధానికి పంపకండి.. వారికి జెలెన్‌స్కీ విజ్ఞప్తి
కీవ్: తమ దేశం పై రష్యా యుద్ధం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశారు. latest telugu news..
కీవ్: తమ దేశం పై రష్యా యుద్ధం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా సైనికుల తల్లులు తమ కుమారులను ఉక్రెయిన్‌లో యుద్ధానికి పంపకుండా నిరోధించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం ఆయన మాట్లాడిన వీడియోను విడుదల చేశారు. 'నేను రష్యన్ తల్లులకు, ముఖ్యంగా సైనికుల తల్లులకు మరోసారి చెబుతున్నాను.
విదేశంపై యుద్ధానికి మీ కుమారులను పంపకండి' అని అన్నారు. మీ కుమారుడు ఎక్కడ ఉన్నాడో వెతుక్కోవాలని సూచించారు. మీ కొడుకును ఉక్రెయిన్‌పై యుద్ధానికి పంపే అవకాశం ఉంటే, చనిపోకుండా లేదా పట్టుబడకుండా వెంటనే అడ్డుకోవాలని కోరారు. ఉక్రెయిన్ ఇలాంటి భయంకరమైన యుద్దాన్ని కోరుకోవట్లేదని ఆయన అన్నారు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో దీనిని అడ్డుకుంటుందని చెప్పారు.