'కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలి'

దిశ, తెలంగాణ బ్యూరో: టూరిజం-Chada Venkatereddy wrote a letter to the Chief Minister asking him to regularize the contract employees in the Tourism Corporation

Update: 2022-04-01 13:59 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: టూరిజం కార్పోరేషన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ముఖ్యమంత్రికి లేఖ రాశారు. టూరిజం కార్పోరేషన్‌లో సుమారు 25 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్‌ పద్దతిలో దాదాపు 170 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారని, ఉమ్మడి రాష్ట్రం నుండి 'సమాన పనికి సమాన వేతనం' ఇస్తున్నారని, ఈ మధ్య కాలంలో రెగ్యులర్‌ ఉద్యోగులతోపాటు 30 శాతం పీఆర్‌సీని కూడా ప్రభుత్వం ఇవ్వడం జరిగిందన్నారు.


అయితే చాలా కాలం నుంచి టూరిజం కార్పోరేషన్‌లో ఉద్యోగుల క్రమబద్దీకరణ లేకపోవడంతో ఉద్యోగులు తీవ్ర నిరాశకు లోనైతున్నారని, అయితే ఈ బడ్జెట్‌ సమావేశంలో మీరు అసెంబ్లీ సాక్షిగా రాష్ట్రంలోని అన్ని శాఖలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తామని ప్రకటించినట్లు గుర్తు చేశారు. ఈ ప్రకటనతో టూరిజం కార్పోరేషన్‌ ఉద్యోగులు కూడా సంతోషం వ్యక్తం చేశారని, అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ ప్రకారం టూరిజం కార్పోరేషన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే క్రమబద్దీకరించాలని కోరారు.

Tags:    

Similar News