మియామీ ఓపెన్ చాంపియన్‌గా స్పానిష్ ఆటగాడు

ఫ్లోరిడా: మియామీ ఓపెన్ - Carlos Alcaraz, 18, becomes youngest Miami Open champion, third-youngest winner of any ATP Masters 1000 event

Update: 2022-04-04 17:08 GMT

ఫ్లోరిడా: మియామీ ఓపెన్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ టోర్నీ విజేతగా స్పానిష్ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్ నిలిచాడు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం మియామీ గార్డెన్స్‌లోని హార్డ్ రాక్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్ టోర్నీలో 18ఏళ్ల స్పెయిన్ ఆటగాడు కార్లోస్ నార్వేజియన్ ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ క్యాస్పర్ రూడ్‌పై 7-5,6-4 తేడాతో మియామీ ఓపెన్‌ గెలుపొందాడు. స్పానిష్ 14వ సీడ్ ఆటగాడి కెరీర్‌లోనే ఇది అతిపెద్ద విజయంగా తెలుస్తోంది. అతి చిన్న వయస్సులోనే తన మొదటి ATP మాస్టర్స్ 1000 కిరీటాన్ని సంపాదించిన అల్కరాజ్.. రాఫా నాదల్‌తో సహా అతని స్వదేశీ ఆటగాళ్లు ఎనిమిది మందిలో మియామీ టైటిల్ గెలిచిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించాడు.

అంతేకాకుండా 37 ఏళ్ల టెన్నిస్ కెరీర్‌లో జకోవిచ్ వలన సాధ్యం కానీ ఫీట్‌ను అల్కరాజ్ అతి చిన్న వయస్సులోనే సాధించి వరల్డ్ నంబర్ వన్‌ను అధిగమించాడు. 52 నిమిషాల పాటు సాగిన టోర్నీలో ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు ఈ యువ చాంపియన్ చాలా ఒత్తిడిని భరించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా అల్కరాజ్ మాట్లాడుతూ ' ఈ విజయాన్ని నేను ఎలా భావిస్తున్నానో వివరించడానికి నా దగ్గర మాటలు లేవు.అయితే, మియామీలో నా మాస్టర్స్ 1000 గెలవడం చాలా ప్రత్యేకమైనది'. అంటూ చెప్పుకొచ్చాడు.

Tags:    

Similar News