పీరియడ్స్ టైమ్‌లో స్విమ్మింగ్ చేయొచ్చా?

దిశ, ఫీచర్స్: పీరియడ్ టైమ్‌లో స్విమ్మింగ్ సేఫ్ కాదని పెద్దలు చెప్పేది వింటున్నారా?

Update: 2022-07-18 14:49 GMT

దిశ, ఫీచర్స్: పీరియడ్ టైమ్‌లో స్విమ్మింగ్ సేఫ్ కాదని పెద్దలు చెప్పేది వింటున్నారా? అయితే మీరు తప్పుడు సమాచారం అనుకున్నట్లే. నెలసరి సమయంలోనూ ఈత కొట్టడం కచ్చితంగా సురక్షితమని వాదిస్తున్నారు నిపుణులు. సరైన మెన్‌స్ట్రువల్ ప్రొడక్ట్స్ వాడినప్పుడు.. మీతోపాటు ఇతరులకు కూడా ఎలాంటి హైజీన్ ప్రాబ్లమ్స్ ఉండవని వివరిస్తున్నారు. ఈ వాదన కొందరికి విసుగుపుట్టించినా.. ఏ విధంగా సురక్షితమో తెలుసుకుందాం.

బీచ్ వెకేషన్ ప్లాన్ చేసిన సమయంలో పీరియడ్స్ వస్తే ప్లాన్ అంతా ఫ్లాప్ అనుకుంటారు. వెళ్లినా స్విమ్ చేయలేమని బాధపడిపోతుంటారు. కానీ టాంపోన్స్, మెన్‌స్ట్రువల్ కప్స్, మెన్‌స్ట్రువల్ డిస్క్స్ యూజ్ చేయడం ద్వారా హైజీన్‌ ఎఫెక్ట్ ఉండదని నిపుణులు చెప్తున్నారు. అన్ఇంటెన్షనల్ లీకింగ్ లేకుండా టైమ్, మనీ సేవ్ అవుతుందని సూచిస్తున్న ఎక్స్‌పర్ట్స్.. ప్యాడ్స్ మాత్రం ఒక్కసారి తడి అయిపోగానే మెన్‌స్ట్రువల్ ఫ్లోను ఆపలేవని, ఆ టైమ్‌లో వాటి వల్ల యూజ్ ఉండదని వివరిస్తున్నారు. కానీ టాంపోన్స్, మెన్‌స్ట్రువల్ కప్స్ ఫ్లో గార్మెంట్స్‌కు చేరకముందే.. అబ్జర్బ్ చేస్తాయని వెల్లడించారు.

ఇన్ఫెక్షన్ అనేది అపోహ

ఇక పీరియడ్స్‌లో స్విమ్మింగ్.. వెజీనాల్ లేదా మెన్‌స్ట్రువల్ ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతుందనేది పూర్తిగా అపోహ. ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకుంటే ఇలాంటివేమీ ఉండవని, వాటర్‌లో స్విమ్మింగ్‌ చేసే ముందు స్థానిక అధికారులను నీటి స్వభావం గురించి అడిగి తెలుసుకుంటే సరిపోతుంది. స్విమ్మింగ్ పూల్స్‌లో ఉండే క్లోరిన్ యోనికి ప్రమాదకరం కాగా.. వెంటనే క్లీన్డ్ క్లాత్స్ ధరిస్తే ప్రాబ్లమ్ ఉండదు. అలా కాకుండా కెమికల్‌కు ఎక్కువకాలం ఎక్స్‌పోజ్ కావడం మూలంగా ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదముంది.


తిమ్మిరి, అలసట పెరుగుతుందా?

నిజానికి పీరియడ్ టైమ్‌లో యాక్టివ్‌గా ఉండటం వలన ఆ సమయంలో ఎదురయ్యే వికారం, అలసట నుంచి విముక్తి లభిస్తుంది. ఫిజికల్ యాక్టివిటీస్ పీరియడ్ పెయిన్‌ను తగ్గిస్తాయి. లో-ఇంటెన్సిటీ ఎక్సర్‌సైజ్‌లు చేయడం మూలంగా రిలీజయ్యే ఎండార్ఫిన్ నేచురల్ పెయిన్ రిలీవర్స్‌గా పనిచేస్తాయి.

Tags:    

Similar News