BSNL: వినియోగదారులకు గుడ్‌న్యూస్ ప్రకటించిన BSNL.. కేబుల్ టీవీ, సెట్-టాప్ బాక్స్‌లతో పనిలేకుండా..!!
కేబుల్ టీవీ, సెట్-టాప్ బాక్స్ లతో పనిలేకుండా.. 500 TV ఛానెల్స్, OTT యాప్స్ తో BSNL ఉచిత టీవీ సర్వీస్‌ను ప్రారంభించింది.
దిశ, వెబ్‌డెస్క్: కేబుల్ టీవీ, సెట్-టాప్ బాక్స్ లతో పనిలేకుండా.. 500 TV ఛానెల్స్, OTT యాప్స్ తో BSNL ఉచిత టీవీ సర్వీస్‌ను ప్రారంభించింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL-బీఎస్ఎన్ఎల్) యూజర్లకు శుభవార్త అందించింది. ఈ ఫ్రీ సర్వీస్‌లో భాగంగా.. నెట్‌ఫ్లిక్స్(Netflix), యూట్యూబ్(Youtube).. గేమింగ్ ఆప్షన్‌లతో పాటు డిస్నీ+ హాట్‌స్టార్(Disney+ Hotstar), అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video),జీ5 (G5) వంటి ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లు కూడా అందుబాటులో ఉంటాయని BSNL ప్రకటించింది.
రీసెంట్‌గా బీఎస్‌ఎన్‌ఎల్ భారతదేశంలో ఫస్ట్ ఫైబర్ ఆధారిత ఇంటర్నెట్ టీవీ సర్వీసులకు స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. దీన్ని అంతా ఐఎఫ్‌టీవీ(IFTV) అని అంటారు. ఇది కేవలం ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. మరికొన్ని రోజుల్లో అన్ని ప్రాంతాలకు విస్తరించనున్నట్లు వెల్లడించింది.
ఫైబర్-టు-ది-హోమ్ (FTTH) చందాదారుల కోసం BSNL కొత్త లోగో మరో ఆరు కొత్త సేవలను స్టార్ట్ చేసింది. ఈ కొత్త సేవలతో పాటు IFTVని కూడా ఇంట్రడ్యూస్ చేసింది. ఈ ఐఎఫ్‌టీవీ సేవలో సుమారు 500 లకు పైగా ఛానెల్స్ చూడవచ్చని అఫిషీయల్‌గా అనౌన్స్ చేసింది బీఎస్ఎన్ఎల్. అలాగే అధికారిక వెబ్ సైట్(Official website) 300 కంటే ఎక్కువ ఛానెల్స్ తమిళనాడు, మధ్యప్రదేశ్ కస్టమర్లకు మాత్రమే వర్తిస్తాయని వెల్లడించింది.
అలాగే ఐఎఫ్‌టీవీ వినియోగదారులకు స్పష్టమైన విజువల్స్ అందిస్తుంది. పే టీవీ సౌకర్యంతో ప్రత్యక్ష టీవీ సేవలను అందించడానికి BSNL ఫైబర్-టు-ది-హోమ్ (FTTH) నెట్‌వర్క్‌ను వాడుతుంది. దేశమంతటా ఈ నెట్‌వర్క్ హాట్‌స్పాట్‌లలో తమ డేటా ధరతో లింక్ లేకుండా హైస్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ చేసేందుకు అనుమతిస్తుంది.
తమిళనాడు(Tamil Nadu), మధ్యప్రదేశ్(Madhya Pradesh) లోని కస్టమ్లకు అధిక స్ట్రీమింగ్ క్వాలిటీతో 500 కు ఎక్కువగా లైవ్ టీవీ ఛానెల్స్ ను చూడానికి సదుపాయం కల్పించామని.. అంతేకాకుండా పే టీవీ కంటెంట్ కూడా అందిస్తున్నామని బీఎస్ఎన్ఎల్ ట్విట్టర్‌లో పోస్ట్ ద్వారా వెల్లడించింది.
స్ట్రీమింగ్ తో వాడే డేటాకు ఎలాంటి ఛార్జీలు ఉండవు. లైవ్ టీవీ సేవ BSNL FTTH కస్టమర్లకు ఎటువంటి ఎక్స్ట్రా ఖర్చు లేకుండా ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. డిస్నీ+ హాట్‌స్టార్, యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్ వీడియో,నెట్‌ఫ్లిక్స్,ZEE5 వంటి ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లు, స్ట్రీమింగ్ యాప్‌లకు కూడా ఇది సపోర్టు చేస్తుందని BSNL పేర్కొంది.
అలాగే గేమ్స్ ప్రియులకు కూడా బీఎస్ఎన్ఎల్ భారీ శుభవార్త అందించింది. ఈ సేవలు ఆండ్రాయిడ్ టీవీలకు మాత్రమే కాకుండా గేమ్స్ కు కూడా ఫ్రీ సర్వీసును అందిస్తున్నామని తెలిపింది.