భర్తతో కాకుండా మరో వ్యక్తితో డేటింగ్.. బ్లైండ్‌గా జరిగిపోయిందంటూ

దిశ, సినిమా : బ్రెజిలియన్ మోడల్ గిసెల్ బాండ్చెన్ తన ఫస్ట్ డేటింగ్‌పై ఓపెన్ అయింది. 42వ పుట్టినరోజు సందర్భంగా కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి అభిమానులకు ఆసక్తికర విషయాలు చెప్పింది..Latest Telugu News

Update: 2022-07-21 08:00 GMT

దిశ, సినిమా : బ్రెజిలియన్ మోడల్ గిసెల్ బాండ్చెన్ తన ఫస్ట్ డేటింగ్‌పై ఓపెన్ అయింది. 42వ పుట్టినరోజు సందర్భంగా కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి అభిమానులకు ఆసక్తికర విషయాలు చెప్పింది. ఈ మేరకు భర్త టామ్ బ్రాడీతోనే మొదటిసారి డిన్నర్‌కు వెళ్లానని, అయితే అప్పటికీ తమకు పెళ్లి కాకపోవడంతో అనేక సవాళ్లను ఎదుర్కొన్నట్లు తెలిపింది. అలాగే తమ ఫస్ట్ లవ్ నిజంగా బ్లైండ్‌గా మొదలైందన్న గిసెల్.. తనకన్నా ముందే ఇద్దరితో డేటింగ్ చేశానని, ఆయనను మూడో వ్యక్తిగా సెటప్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నానంటూ విమర్శలు చేశారని ఆవేదన వ్యక్తం చేసింది.

చివరగా ఇదంతా ఫన్నీ స్టోరీగా పేర్కొన్న ఆమె.. ఆ మూడు డేట్ డిన్నర్స్ కూడా భర్తతోనే అని చెప్పింది. 'ఇలాంటి తప్పుడు వార్తలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. నా జీవితంలో డిన్నర్‌లకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నా. కొన్నిసార్లు ఇలాంటి రూమర్స్ నుంచి ఎప్పుడు బయటపడగలననే భయంకూడా వేసింది? కానీ, కొన్ని దయగల కళ్లు మాపై చూపించిన ప్రేమతో మా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి' అంటూ చెప్పుకొచ్చింది.


Similar News