Bomb Threats: బెంగళూరులో 7 పాఠశాలలకు బాంబు బెదిరింపులు
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. శుక్రవారం ఉదయం బెంగళూరులోని ఏడు పాఠశాలల్లో
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. శుక్రవారం ఉదయం బెంగళూరులోని ఏడు పాఠశాలల్లో బాంబు ప్రమాదం పొంచిఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్‌లతో పాఠశాలలను తనిఖీ చపట్టారు. అయితే ఎలాంటి విస్పోటన పదార్థాలను కనుగొనలేకపోయామని చెప్పారు. పరీక్షలు జరుగుతుండడంతో విద్యార్థులను వేరే ప్రాంతానికి తరలించారు. దీంతో బాంబు బెదిరింపులు బూటకమని తేల్చారు. దీనిపై కర్ణాటక మంత్రి మాట్లాడుతూ భయపడాల్సిన అవసరమేమి లేదని చెప్పారు. అంతకముందు ఉదయం 11 గంటలకు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. శక్తివంతమైన బాంబును మీ పాఠశాలలో అమర్చారు. ఇది జోక్ కాదు. వెంటనే పోలీసులను పిలవండి. లేకుంటే మీతో పాటు వందల మంది ప్రాణాలకు ప్రమాదం. ఆలస్యం చేయకండి. అంతా మీ చేతుల్లోనే ఉంది' అంటూ మెయిల్ చేశారు. అంతేకాకుండా పాఠశాలల లిస్టు కూడా పంపించారు. ఈ మెయిల్ చేసిన వారి గురించి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.