Kriti Sanon:‘ఛాలెంజింగ్ పాత్రలో నటిస్తేనే సెట్‌లో ఉత్సాహంగా ఉంటాను’.
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్(Kriti Sanon) తన సినీ కెరీర్ గురించి చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్(Kriti Sanon) తన సినీ కెరీర్ గురించి చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అందాల ముద్దుగుమ్మ.. అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ రావు మనవే వాటిని క్రియేట్ చేసుకోవాలంటుంది. కేవలం నటిగానే కాకుండా ఏదైనా కొత్తగా చేయాలనుకుంటున్నానని వెల్లడించింది. తరచూ ఎలాంటి పాత్రల్లో నటిస్తే బాగుంటుందని, ఏదైనా కొత్త దారి ఎంచుకుంటే బాగుంటుందా? అని ఆలోచించేదాన్ని అని పేర్కొంది. సినీ ఇండస్ట్రీ(Film industry)కి ఎంట్రీ ఇచ్చిన వెంటనే ఎవ్వరికైనా వెంటనే అవకాశాలు రావు అని, ఏళ్లు గడవాలని తెలిపింది. విజయం సాధించాలంటే కొద్ది సమయం పడుతుందన అనుభవంతోనే అవకాశాలు వస్తాయని చెప్పుకొచ్చింది. దో పత్తితో వచ్చిన చాన్స్‌తో నటిగానే కాకుండా ప్రొడ్యూసర్ గా తనను తాను ప్రూవ్ చేసుకోవాలనుకున్నానని వివరించింది.
కృతి సనన్ నిర్మాతగా మారడానికి రెండు కారణాలున్నాయని తెలిపింది.ఇప్పటివరకు తను నటించిన పాత్రల్ని మూవీల్లో సృష్టించుకునే ఫ్రీడమ్ ఉంటుందని.. ప్రెజెంట్ సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్లు, నిర్మాతలు మహిళా ప్రాధాన్య స్టోరీలపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపడం లేదని వెల్లడించింది. కాగా ఇలాంటి సమయంలో నిర్మాతగా మారి.. కొత్త స్టోరీలపై దృష్టి సారించి ప్రేక్షకులకు పరిచయం చేయాలనుకుంటున్నానని వెల్లడించింది. అలాగే తను గొప్ప గొప్ప నటులతో పనిచేశానని తెలిపింది. అనుభవమున్న డైరెక్టర్లతో వర్క్ చేశానని వెల్లడించింది. కానీ.. ఛాలెంజింగ్ రూల్స్‌లో నటిస్తేనే తను సెల్ లో యాక్టివ్ గా, ఉత్సాహంగా ఉంటానని, ఎప్పుడెప్పుడూ తన పాత్రలో నటించాలనే ఆత్రుతగా ఉంటుందని చెప్పింది. కానీ సమ్ టైమ్స్ ఛాలెంజింగ్ లేని రూల్స్ లో నటించాల్సి ఉంటుందని.. అప్పుడు సెల్ లో యాక్టివ్ గా ఉండలేని నిద్ర వస్తుందని తెలిపింది. ప్రస్తుతం ఈ బాలీవుడ్ బ్యూటీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.