కుదరదని చెప్పడంతోనే లైంగిక ఆరోపణలు : సీఐ నాగరాజు గౌడ్
సివిల్ కేసులు పరిష్కరించాలని మహిళా తమపై ఒత్తిడి చేయడంతో కుదరదని చెప్పిన ఎస్సై పై లైంగిక ఆరోపణలు చేస్తుందని హయత్ నగర్ సీఐ నాగరాజు గౌడ్ తెలిపారు.
దిశ, చైతన్య పురి : సివిల్ కేసులు పరిష్కరించాలని మహిళా తమపై ఒత్తిడి చేయడంతో కుదరదని చెప్పిన ఎస్సై పై లైంగిక ఆరోపణలు చేస్తుందని హయత్ నగర్ సీఐ నాగరాజు గౌడ్ తెలిపారు. ఎస్సై పై మహిళ చేసిన ఆరోపణలు అవాస్తవమని ఆయన పేర్కొన్నారు. తన కేసు పరిష్కరించాలని బాధితురాలు ఎస్సై సైదులు వేధిస్తున్నట్లు తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్లు వివరించారు. రెండో పెళ్లి చేసుకున్న తన భర్త దగ్గరనుంచి బంగారం, డబ్బులు ఇప్పించాలంటూ పావని అనే మహిళ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించిందన్నారు. పావని వేధింపులు తట్టుకోలేక రెండో భర్త పారిపోయాడని రెండో భర్తను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని, ఇప్పుడు అతడు కనిపించడం లేదని పావని మిస్సింగ్ కేసు పెట్టింది. కేసు దర్యాప్తులో రెండో భర్తను ఆంధ్రప్రదేశ్ లో గుర్తించినట్లు తెలిపారు.
అయితే పావనితో ఉండలేనని అతడు తేల్చి చెప్పగా రెండో భర్త దగ్గర ఉన్న కారు ఇప్పించాలని మాపై పావని ఒత్తిడి చేసిందన్నారు. తన తల్లి పేరు మీద ఉన్న కారుకు తానే ఈఎంఐ కడుతున్నట్లు అతను తెలిపాడు. అయినప్పటికీ పావనికి కారు ఇప్పించాము. కారుతో పాటు బంగారం, నగలు ఇప్పించాలని మళ్లీ మాపై ఒత్తిడి తెచ్చిందన్నారు. బంగారం, నగదు సివిల్ వివాదమని మేము ఇప్పించలేమనే కోర్టుకు వెళ్ళమని సూచించామన్నారు. తాను న్యాయవాదినంటూ కేసు పరిష్కరించాలని మాపై ఒత్తిడి తెచ్చిందని కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్సై పై వేధింపులకు గురి చేస్తున్నాడని తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్లు సీఐ వివరించారు. మహిళ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తమన్నారు. పావని కేసును ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు.