ప్రియుడితో లిప్ లాక్ ఫొటోను షేర్ చేసిన బాలీవుడ్ డైరెక్టర్ కూతురు..
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా కశ్యప్ గత రెండేళ్లుగా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి సహజీవనం చేస్తుంది..Latest Telugu News
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా కశ్యప్ గత రెండేళ్లుగా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి సహజీవనం చేస్తుంది. సోషల్ మిడీయాలో యాక్టీవ్ గా ఉంటూ తన హాట్ హాట్ ఫొటోలతో పాటు ప్రియుడితో చట్టాపట్టాలేసుకొని తిరిగిన ఫొటోలను కూడా షేర్ చేస్తుంది.
అయితే ఈ రోజు వారి ప్రేమ మొదలై 2 సంవత్సరాలు కావడంతో యానివర్సరీలో భాగంగా ముద్దులు పెట్టుకుంటున్న ఫొటోలను వారి వారి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా షేన్ ఓ ఫొటోను షేర్ చేస్తూ ఇలా రాశాడు.. 'నా ప్రియాతిప్రియమైన దేవతకు హ్యాపీ సెకండ్ యానివర్సరీ. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్, పార్ట్‌నర్ మాత్రమే కాదు, నా సర్వస్వం నువ్వే! నిత్యం నాకోసం సమయం కేటాయిస్తూ నాకు సంతోషాన్ని పంచుతున్నందుకు చాలా సంతోషం. ఐ లవ్యూ, నిజం చెప్పాలంటే నీ వేలికి ఎప్పుడెప్పుడు ఉంగరం తొడుగుదామా? అని తెగ ఆరాటపడుతున్నాను' అంటూ రాసుకొచ్చాడు. షేన్ ఆతృత చూస్తోంటే కాలం కలిసొస్తే త్వరలోనే వీరు పెళ్లి చేసుకోనున్నట్లు కనిపిస్తోంది.