‘పెళ్లికి ముందే డేటింగ్ చేశాం.. ఈ విషయం బయట చెప్పాలంటే భయమేస్తుంది’.. నటుడు షాకింగ్ కామెంట్స్

తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే సహజీవనంపై కామెంట్స్ చేశారు.

Update: 2024-11-09 04:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే(Vikrant Massey) సహజీవనంపై కామెంట్స్ చేశారు. ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించాలంటే లవ్ ప్రధానమని తెలిపారు. సహజీవనం ఇద్దరి మధ్య అర్థం చేసుకునే గుణం ఉంటుందని వెల్లడించాడు. కాబోయే భాగస్వామి అర్థం చేసుకుంటే జీవితం సాఫీగా సాగిపోతుందని పేర్కొన్నాడు. కాగా 12th హీరో సహజీవన విధానాన్నే నమ్ముతానని తెలిపాడు. ఇది వాస్తవం కానీ.. ఈ విషయం గురించి బయట మాట్లాడాలంటే భయంగా ఉందని వివరించాడు. కానీ అందరి జీవితంలో ఈ ఆలోచన పనిచేస్తుందని గ్యారంటీ లేదని వ్యాఖ్యానించాడు. నా వైఫ్, నేను సేమ్ ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి.. లైఫ్ లాంగ్ ఇలాగే కలిసిమెలసి ఉండాలని భావిస్తున్నానని పేర్కొన్నాడు. అలాగే విక్రాంత్ మాస్సే మరో సీక్రెట్ కూడా బయట పెట్టాడు. తన భార్యతో మ్యారేజ్ కు ముందే డేటింగ్ చేశాడని ఓపెన్ కామెంట్స్ చేశాడు. కాగా ఒకరినొకరు అర్థం చేసుకున్నాం కాబట్టే తమ రిలేషన్ పెళ్లి వరకు వెళ్లిందని చెప్పాడు. ముందుగా లైఫ్ పార్ట్నర్ ను ఎంపిక చేసుకుని లవ్ లో పడితే మాత్రం లైఫ్ చాలా సంతోషంగా ఉంటుందని తెలిపాడు. భాగస్వామి అండ్ కెరీర్ ఎంపిక.. లైఫ్ నే టోటల్ గా ఛేంజ్ చేస్తుందని వెల్లడించాడు.  

Tags:    

Similar News