తెలంగాణ క్లీన్ స్వీప్‌పై బీజేపీ ఫోకస్.. రంగంలోకి బలమైన నేతలు!
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ స్థానాలపై కాషాయ దళం ఫోకస్పెడుతోంది.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ స్థానాలపై కాషాయ దళం ఫోకస్పెడుతోంది. బలమైన నేతలెవరా అని ఇప్పటి నుంచే ఆరా తీస్తోంది. అవసరమైతే ఇతర పార్టీల్లో బలమైన అభ్యర్థులను పార్టీలోకి లాగి కాషాయ తీర్థం పుచ్చుకునేలా చేయాలని జాతీయ నాయకత్వం ప్రణాళికలు చేస్తోంది. అందులో భాగంగా 'ఆపరేషన్17'కు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే బీజేపీ ఖాతాలో 4 పార్లమెంట్ స్థానాలున్నాయి. కరీంనగర్‌నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, సికింద్రాబాద్‌నుంచి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, నిజామాబాద్నుంచి ధర్మపురి అర్వింద్, ఆదిలాబాద్‌నుంచి సోయం బాపూరావు ఎంపీలుగా కొనసాగుతున్నారు. అయితే ఈసారి తెలంగాణలోని 17 పార్లమెంట్స్థానాలను క్లీన్స్వీప్చేయాలని భావిస్తోంది. ఈ 4 స్థానాలతో పాటు మిగిలిన 13 స్థానాలను కూడా కైవసం చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన ఎన్నికల్లో బీజేపీ విజయబావుటా ఎగురవేసింది. ఫుల్‌జోష్‌లో ఉంది. ఈ విక్టరీ జోష్‌ను ఇలాగే కొనసాగిస్తూ రాష్ట్రాల్లో ఇంకొంచెం కష్టపడితే చాలని రాష్ట్ర నాయకత్వానికి హైకమాండ్ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. అంతర్గతంగా ఇప్పటికే ఇతర పార్టీల్లో గెలుపు అవకాశాలున్న నేతలను తమ వైపునకు తిప్పుకునే పనిలో పడినట్లు సమాచారం. ఇతర పార్టీల్లో బలమైన నేతలతో పాటు తమ పార్టీలో ఉన్న వారి గెలుపు అవకాశాలపైనా నజర్ పెట్టిందా అంటే అవుననే శ్రేణుల నుంచి సమాధానం వస్తోంది. అందుకే వీలైనంత త్వరగా రాష్ట్రంలో పట్టు సాధించే దిశగా అడుగులు ప్రారంభించినట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీలో పట్టుకోసం ఎంపీ స్థానాలే టార్గెట్‌గా ఆపరేషన్ మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. అటు ఎంపీ స్థానాలతో పాటు అసెంబ్లీ స్థానాలపై కూడా పట్టు సాధించాలని బీజేపీ హైకమాండ్యోచిస్తోంది. అలా అయితే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం పక్కా అని భావిస్తోంది.
తెలంగాణలో ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై పూర్తిస్థాయిలో పట్టు సాధించేందుకు బీజేపీ యత్నిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీలు వేసి కార్యాచరణను సైతం రూపొందించింది. గతంలోనే ఆయా నియోజకవర్గాలకు చెందిన నేతలతో బీజేపీ రాష్ట్ర అధిష్టానం సమావేశాలు నిర్వహించి నాయకులకు దిశానిర్దేశం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడమే కాకుండా కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తే సగం సక్సెస్అయినట్లేనని, అలాగే కేసీఆర్ఇస్తామని అమలుచేయని హామీలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా బీజేపీకి చాలా ఎంపీ స్థానాల్లో బలమైన నేతలు లేకపోవడం ఆ పార్టీకి మైనస్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీంతో బలమైన నేతలను పార్టీలోకి తీసుకురావాలన్న అభిప్రాయానికి వచ్చిన జాతీయ నాయకత్వం ఆ నేతల వేటలో పడిందని సమాచారం. దీనికోసం హైకమాండ్సైతం ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే చేవెళ్ల నియోజకవర్గం నుంచి ఈ ఆపరేషన్ మొదలైనట్టు చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో గతంలో ఎంపీగా పనిచేసిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర నాయకత్వం సమావేశమైనట్లు తెలుస్తోంది. విశ్వేశ్వర్‌రెడ్డికి గతంలో ఎంపీగా గెలిచిన అనుభవంతో పాటు ఆ నియోజకవర్గంలో మంచి పట్టుంది. ఆర్థికంగా కూడా బలంగా ఉన్న వ్యక్తి కావడంతో ఆయనతో సంప్రదింపులు చేసినట్లు తెలుస్తోంది. ఇక భువనగిరి ఎంపీ స్థానంలోనూ పట్టుకోసం ఉద్యమ నేతలను తమ పార్టీలో చేర్చుకుంది బీజేపీ. ఉద్యమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు కీలకంగా పనిచేసిన జిట్టా బాలకృష్ణారెడ్డి చేరికతో భువనగిరిలో పార్టీకి పట్టు పెరిగిందని బీజేపీ నేతలు భావిస్తున్నారు.
ఇక ఇప్పటికే మహబూబ్ నగర్ నుంచి ఇద్దరు కీలక నేతలు డీకే అరుణ, జితేందర్‌రెడ్డి బీజేపీలో కొనసాగుతున్నారు. వీరు కూడా బలమైన కేడర్, ఆర్థిక బలం ఉన్న నేతలే కావడంతో ఆ నియోజక వర్గంలో అసెంబ్లీ స్థానాల్లో పట్టు సాధించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందనే భావనలో బీజేపీ నేతలు ఉన్నారు. వీటితో పాటు పార్టీకి అసలు పట్టులేని నల్లగొండ ఎంపీ స్థానంపై కన్నేసినట్టుగా చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలోనూ బలమైన సామాజికవర్గానికి చెందిన ఓ నేతతో ఇప్పటికే చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఢిల్లీ స్థాయిలో ఆ నేత ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు కూడా సమావేశమైనట్లుగా చర్చ సాగుతోంది. ఈ సమావేశం అనంతరం ఆ నేత కూడా బీజేపీపై సానుకూలంగా ఉన్నట్లుగా ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం టీఆర్ఎస్ ఎంపీ స్థానమైన జహీరాబాద్ పైనా బీజేపీ దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. ఈ స్థానం నుంచి అటు జాతీయ నాయకత్వం, మహారాష్ట్ర బీజేపీ నేతలతో సత్సంబంధాలు ఉన్న నేత బీజేపీ వైపు చూస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా ఇక ఏమాత్రం కేడర్ లేని ఖమ్మంలోనూ పట్టుకోసం బీజేపీ నాయకత్వం వేగంగా పావులు కుదుపుతోంది. ఈ నియోజకవర్గానికి చెందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు టీఆర్ఎస్‌పై అసంతృప్తిగా ఉన్నారని. త్వరలో వారు కాషాయ తీర్థం పుచ్చుకుంటారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. వీరు బీజేపీలో చేరితే ఉమ్మడి ఖమ్మం జిల్లాను బీజేపీ కైవసం చేసుకోవచ్చిన కమలనాథులు భావిస్తున్నారు.
బీజేపీకి ఇప్పుడున్న నాలుగు ఎంపీ స్థానాలతో పాటు మిగతా 13 చోట్ల బలమైన నేతలను గుర్తించి వారిని రంగంలోకి దింపి అటు ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవడంతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ బలం పెంచుకోవాలని బీజేపీ యోచిస్తోంది. అందుకోసం ఇప్పటికే పెండిగ్‌లో ఉన్న రైల్వే, జాతీయ రహదారుల నిర్మాణాలను వేగవంతం చేసినట్టు చెబుతున్నారు. ఇటీవల పలు అభివృద్ధి పనుల పూర్తికి కేంద్ర నిధులు సైతం కేటాయించింది. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే బీజేపీ గెలుపు మరింత సునాయాసమని కాషాయ దళం భావిస్తోంది.