అగ్నివీరులకు ఇవ్వకపోతే పెన్షన్ వదులుకుంటా..బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ

న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ మరోసారి కేంద్రప్రభుత్వంపై మండిపడ్డారు. అగ్నిపథ్ నియమాకాల్లో అగ్నివీరులకు ఫించన్ ఇవ్వకపోవడంపై ఆగ్రహాం వ్యక్తం చేశారు..Latest Telugu News

Update: 2022-06-24 09:44 GMT

న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ మరోసారి కేంద్రప్రభుత్వంపై మండిపడ్డారు. అగ్నిపథ్ నియమాకాల్లో అగ్నివీరులకు ఫించన్ ఇవ్వకపోవడంపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా స్పందించారు. 'స్వల్పకాలిక సేవలందించిన అగ్నివీరులు పింఛన్‌కు అర్హులు కాదు.

కానీ, ప్రజా ప్రతినిధులకు ఈ సౌకర్యం ఎందుకు? జాతీయ కాపలాదారులకు పెన్షన్ హక్కు లేకపోతే, నేను కూడా నా స్వంత పెన్షన్ వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఎమ్మెల్యేలు/ఎంపీలు మన పెన్షన్‌ని వదిలి అగ్నివీరులకు పెన్షన్‌ వచ్చేలా చూడలేమా?' అని ట్వీట్ చేశారు. ఈ నెల 14న కేంద్రం నాలుగేళ్ల సర్వీస్ కూడిన అగ్నివీరుల నియామకానికి అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చింది. ఎలాంటి పెన్షన్, ఇతర సదుపాయాలు వీరికి లభించవని పేర్కొంది. దీనిపై ప్రతిపక్షాలతో పాటు యువత, మాజీ సైనిక అధికారులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. 


Similar News