'అసెంబ్లీలో కేసీఆర్-భట్టి ఒకరినొకరు పొగుడుకున్నారు'
దిశ, తెలంగాణ బ్యూరో: సీఎల్పీ నేత భట్టి విక్రమార్కపై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్ర విమర్శలు చేశారు. గురువారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద బీజేపీ ఆధ్వర్యంలో 'ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష' చేపట్టారు.
దిశ, తెలంగాణ బ్యూరో: సీఎల్పీ నేత భట్టి విక్రమార్కపై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్ర విమర్శలు చేశారు. గురువారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద బీజేపీ ఆధ్వర్యంలో 'ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష' చేపట్టారు. ఈ దీక్షలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ.. అసెంబ్లీలో భట్టి విక్రమార్కను కేసీఆర్ పొగిడారు.. కేసీఆర్‌ను భట్టి విక్రమార్క పొగిడారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, టీఆర్ఎస్‌లు ఒకటే అని అన్నారు. కేసీఆర్ చెప్పిన మాటలను ఢిల్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఉక్రెయిన్ బాధితులను కాపాడేందుకు కష్టపడినట్లు అసెంబ్లీ వేదికగా టీఆర్ఎస్ నేలు అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. సభలో కాంగ్రెస్ నేతలుంటే తప్పులేదు.. కానీ, బీజేపీ నేతలు ముగ్గురుంటే ఇబ్బంది అని భయపడి బయటకు పంపారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగం నడవొద్దు.. అంబేద్కర్ రాజ్యాంగం మాత్రమే నడవాలని వ్యాఖ్యానించారు. ఇవాళ అసెంబ్లీలో ఉన్నది ముగ్గురు మాత్రమే కావచ్చు.. భవిష్యత్‌లో 63 అవుతుందని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో గజ్వేల్‌కు వచ్చి, హుజురాబాద్ సీన్ రిపీట్ చేస్తామని సవాల్ విసిరారు.