బీజేపీ నేత గన్ లైసెన్స్ రద్దు..

Update: 2022-03-19 09:41 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఘర్షణలో పాల్గొన్న బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి తుపాకీ లైసెన్స్ రద్దు చేస్తూ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం రాత్రి జరిగిన ఘర్షణలో గోపిపై పోలీసులు రెండు ఎఫ్ ఐఆర్ లు నమోదు చేశారు. ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో నమోదయిన క్రైం నెంబర్ 66/2022లో 143, 341, 353 రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్లలో, క్రైం నెంబర్ 67/2022లో 307, 448, 148 రెడ్ విత్ 149 సెక్షన్లలో గోపిపై రెండు కేసులు నమోదయ్యాయని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఇచ్చిన సమాచారం మేరకు గన్ లైసెన్స్ రద్దు చేస్తున్నట్టు కలెక్టర్ ఆ ఉత్తర్వులో తెలిపారు. రెడ్డబోయిన గోపి లైసెన్స్ నెంబర్ 02/ఆర్ఎస్ఎల్ఏ/2020ని రద్దు చేస్తున్నట్టు వివరించారు. 1959 ఆర్మ్స్ యాక్ట్ లోని సెక్షన్ 17, సబ్ సెక్షన్ 3(బి((డి) ప్రకారం లైసెన్స్ రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు.



 


Tags:    

Similar News