Bigg Boss 8 Telugu: నామినేషన్స్‌లో యష్మీ, గౌతమ్ మధ్య ‘ముద్దు’ సంభాషణ.. నెటిజన్ల రియాక్షన్ ఇదే?
నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్‌బాస్ సీజన్-8 అట్టహాసంగా సాగుతోంది.
దిశ, వెబ్‌డెస్క్: నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్‌బాస్ సీజన్-8 అట్టహాసంగా సాగుతోంది. పోయిన వీక్ నయని పావని ఎలిమినేట్ అవ్వగా.. ప్రస్తుతం ఈ వీక్ నామినేషన్స్ హోరాహోరీగా సాగుతున్నాయి. ఈ నామినేషన్స్ ఎక్కువగా రివెంజ్ నామినేషన్స్ లాగా కనిపిన్నాయి. హరితేజను నామినేట్ చేసిందని ప్రేరణ.. తనకు రివెంజ్ నామినేషన్ చేసింది. ఇలా గౌతమ్, యష్మీ కూడా రివెంజ్ నామినేషన్ చేసుకున్నారు. అయితే ఈ నామినేషన్స్ లో గౌతమ్-యష్మీ మధ్యలో కాస్త రొమాంటిక్ సంభాషణ నడిచింది. గతవారం టాస్కుల్లో గౌతమ్ సరిగ్గ ఆడలేదని యష్మీ ఫీలైన విషయం తెలిసిందే. ఆ మ్యాటర్‌ను యష్మీ.. ఇప్పుడు గుర్తు చేసింది.
బాగా ఆడలేదు కాబట్టే ఆడలేదు అన్నాననంటుంది యష్మీ. లేకపోతే వచ్చి ముద్దు పెట్టి బాగా ఆడావని చెప్పాలి అనుకుంటున్నావా అంటుంది. అక్కడ సంభాషణ కాస్త సీరియస్ గా సాగగ.. గౌతమ్ సిగ్గుపడడం ఈ నామినేషన్స్ లో హైలెట్ గా నిలిచింది. సీరియస్‌గా జరిగే నామినేషన్స్ సమయంలో ఇలాంటి మాటలేంటి అని ఆడియన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక యష్మీ కూడా వచ్చి గౌతమ్‌నే నామినేట్ చేసి తనను అక్క అని పిలవడం ఇష్టం లేదని తేల్చి చెబుతుంది. అలా ఇద్దరి నామినేషన్ కాస్త సరదాగా, కాస్త సీరియస్‌గా సాగాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.