బిగ్‌బాస్-8: హౌస్‌లో గంగవ్వకు గుండెపోటు.. ఇంటి నుంచి గెట్ అవుట్ అయినట్టేనా! (పోస్ట్)

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్-8(Bigg Boss-8) సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది.

Update: 2024-10-24 06:12 GMT

దిశ, సినిమా: తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్-8(Bigg Boss-8) సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. అయితే ఈ సారి సెప్టెంబర్ 1న ఈ షో ప్రారంభమవగా.. ఇందులో 14 మంది కంటెస్టెంట్స్ ఇంట్లోకి వెళ్ళారు. కానీ కొందరు ఎలిమినేట్ అయి ఇంటికి కూడా వెళ్లిపోయారు. అయితే ఇటీవల 8 మంది గంగవ్వ, ముక్కు అవినాష్, రోహిణి, మెహబూబ్, హరితేజ, టేస్టీ తేజ, గౌతమ్, నయని పావని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ‘బిగ్‌బాస్-8’(Bigg Boss-8) టాస్కులు, గొడవలతో రోజు రోజుకు రసవత్తరంగా మారుతోంది.

ఈ క్రమంలో.. తాజాగా, గంగవ్వ(Gangavva )కు హౌస్‌లో ఉండగానే గుండె పోటు వచ్చిందని పలు వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అయితే బిగ్‌బాస్ నిర్వాహకులు ఈ విషయాన్ని బయటకు రాకుండా ఆమెకు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై గంగవ్వతో పని చేసిన మై విలేజ్ షో టీమ్ మెంబర్ అనిల్ గీల(Anil Geela) ఇన్‌స్టా వేదికగా క్లారిటీ ఇచ్చాడు. ‘‘గంగవ్వకు బిగ్‌బాస్ హౌస్‌లో ఉండగా గుండెపోటు వచ్చిందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఆమె చాలా ఆరోగ్యంగా ఉన్నారు. దయచేసి ఫేక్ న్యూస్‌ను స్ప్రెడ్ చేయకండి’’ అని రాసుకొచ్చాడు.

ఇదిలా ఉండగా.. ఇటీవల గంగవ్వ(Gangavva )తో పాటు రాజు అనే వ్యక్తిపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. చిలుకను హింసించి వన్యప్రాణుల రక్షణ చట్టాన్ని ఉల్లంఘించారని జంతు సంరక్షణ కార్యకర్త ఎదులాపురం గౌతమ్(Gautam) వీరిద్దరిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. అయితే ఈ కేసులో యూట్యూబర్ రాజు(raaju) 25 వేల రూపాయలు ఫైన్ చెల్లించినట్లు తెలుస్తోంది. ఇక గంగవ్వ ఈ కేసు విషయంలోనైనా బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చే చాన్స్ ఉన్నట్లు పలు వార్తలు వైరల్‌గా మారాయి.

Tags:    

Similar News