ధోని తర్వాత CSK టీమ్ కెప్టెన్ అతడేనా..?
దిశ, వెబ్ డెస్క్: భారత మాజీ కెప్టెన్, అలాగే ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుత కెప్టెన్ MS దోనికి ప్రస్తుతం latest telugu news..
దిశ, వెబ్ డెస్క్: భారత మాజీ కెప్టెన్, అలాగే ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుత కెప్టెన్ MS దోనికి ప్రస్తుతం 40 ఏళ్ల వయస్సు ఉంది. ధోని 2020 లో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే గత ఐపీఎల్ సీజన్ లో CSK నాలుగో కప్ గెలుచుకున్నప్పటికి ధోని ఫెలవ ప్రదర్శన కనబరిచారు. గత సీజన్లో ధోని 16 మ్యాచ్ లలో కేవలం 114 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అంతా దోని పని ఐపోయిందనుకున్నారు.
అలాగే దోని ఎప్పుడు ఐపీఎల్ నుంచి వైదొలుగుతాడో అని అందరి మైండ్ లో వచ్చిన ఆలోచన. ఈ తరుణంలో ధోని కూడా తన మదిలో ఉన్న ఆలోచనను టీమ్ ప్రాంచైజీ కి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపై తాను అగ్రశ్రేణి ఆటగాడినని ధోని స్పష్టం చేశారు. అలాగే ఐపిఎల్ 2022 మెగా వేలానికి ముందు అతని వేతనం లో కూడా భారీ కోత విధించారు. ధోని తర్వాత..ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.
అయితే ఇటీవల ధోని కూడా తన చివరి ఐపీఎల్ మ్యాచ్ చెపాక్ స్టేడియం లో స్వదేశీ అభిమానుల సమక్షంలో ఆడాలనుకుంటున్నట్లు ధోనీ స్పష్టం చేశారు.''నా చివరి టీ20 చెన్నైలో జరుగుతుందని ఆశిస్తున్నాను. ఇది వచ్చే సంవత్సరమో, లేదా ఐదేళ్లలోనే మాకు నిజంగా తెలియదు, "అని MS ధోని CSK ఈవెంట్‌లో అన్నారు. దీంతో ధోని ఐపీఎల్ లో ఎప్పటి వరకు ఉంటారో అని అతని అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఒక వేల దోనికి ఈ సంవత్సరమే చివరిది అయితే తదుపరి CSK టీమ్ కెప్టెన్ గా ఎవరిని ఎంచుకుంటారో వేచి చూడాలి మరి.
Flipping it in #Tha7A style! #Yellove #WhistlePodu 🦁💛 pic.twitter.com/pzzIKY8tYG
— Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) March 14, 2022