రాయికల్ ఆస్పత్రి ల్యాండ్‌లో బిగ్ ట్విస్ట్.. ఎంటరైన పోలీసులు

దిశ ప్రతినిధి, కరీంనగర్: జగిత్యాల జిల్లా రాయికల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థల వివాదం మరో మలుపు తిరిగింది.

Update: 2022-06-30 10:37 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: జగిత్యాల జిల్లా రాయికల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థల వివాదం మరో మలుపు తిరిగింది. తన తాత ద్వారా వారసత్వంగా సంక్రమించిన భూమి విషయంలో ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారని రంజిత్ ఆడియో విడుదల చేశారు. గురువారం ఉదయం నెట్టింట వైరల్ అయిన ఈ ఆడియోలో జీవన్ రెడ్డి ఇంటి ముందు ఫ్యామిలీతో సహా కలిసి మందు తాగి చస్తామని హెచ్చరించాడు. ఈ ఆడియో లీక్ అయిన కొన్ని గంటల్లోనే ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. సర్వే నెంబర్ 51, 52లో 3 ఎకరాల 6 గుంటల భూమిలో బలుసు భూమక్క, బలుసు లక్ష్మీలు తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి విరాసత్ తీసుకున్నారని, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం పొందారని ఎస్సై కిరణ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు రాయికల్ తహసీల్దార్ దిలీప్ నాయక్ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ చెప్పారు.

Tags:    

Similar News