హర్ష సాయి కేసులో బిగ్ ట్విస్ట్.. బిగ్‌బాస్ ఫేమ్ శేఖర్ బాషా అరెస్ట్! (వీడియో)

గత కొద్ది రోజులుగా సినీ ఇండస్ట్రీకి చెందిన చాలామంది సెలబ్రిటీలు పలు కేసుల్లో చిక్కుకుంటున్నారు.

Update: 2024-10-19 06:06 GMT

దిశ, సినిమా: గత కొద్ది రోజులుగా సినీ ఇండస్ట్రీకి చెందిన చాలామంది సెలబ్రిటీలు పలు కేసుల్లో చిక్కుకుంటున్నారు. ఇప్పటికే పలువురు లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కుని వివాదాలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల యూట్యూబర్ హర్ష సాయి(Harsha Sai) పై ఓ అమ్మాయి రేప్ కేసు పెట్టింది. దీంతో అతను కనిపించకుండా పోవడంతో విదేశాలకు వెళ్లాడని అతని కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ ఫేమ్ శేఖర్ బాషా(Shekhar Basha), హర్ష సాయి(Harsha Sai) కేసుపై రియాక్ట్ అయి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

దీంతో యూట్యూబర్ హర్ష సాయి బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ కేసులో శేఖర్ బాషా(Shekhar Basha)ను అదుపులోకి తీసుకుని మూడు గంటల పాటు విచారించినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. తాజాగా, దీనిపై శేఖర్ బాషా స్పందిస్తూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు. ‘‘హాయ్ ఫ్రెండ్స్ నేను శేఖర్ బాషాను మాట్లాడుతున్నాను. నన్ను ఎవ్వడు అరెస్ట్ చేయలేదు జైల్లో పెట్టలేదు. ఏదో ఒక న్యూల్ ప్రచారంలోకి వచ్చింది. అన్ని చానల్స్‌లో శేఖర్ బాషా అరెస్ట్ అయ్యారని రిమాండ్‌కు తరలించారు అని ఏవేవో వస్తున్నాయి.

అవన్నీ నిజాలు కాదు నమ్మకండి. నేను ప్రో కబడ్డీ లీగ్ చూడటానికి గచ్చిబౌలి స్టేడియానికి వెళ్లాను. అనుకోకుండా నా ఫోన్ స్విచ్చాఫ్ అయి పోవడం వల్ల నేను అందుబాటులోకి రాలేకపోయాను. సోషల్ మీడియాలో వినిపిస్తున్నవన్నీ రూమర్స్. ఇది దొంగ వీడియో అనుకోకండి ఈ రోజూ న్యూస్ పేపర్ కూడా చూడండి నేను మా ఇంట్లోనే ఉన్నాను. ఎవ్వరూ నేను అరెస్ట్ అయ్యానని వచ్చే వార్తలు చూసి టెన్షన్ పెట్టుకోకండి. అందరికీ ఈ న్యూస్‌ను షేర్ చేయండి. సేఫ్‌గా ఉన్నా లవ్ యూ’’ అని చెప్పుకొచ్చారు.

Full View

Tags:    

Similar News