టీఆర్ఎస్ సర్కార్‌ గురించి చెబితే ప్రధాని ఆశ్చర్యపోయారు: కోమటిరెడ్డి

దిశ, భువనగిరి రూరల్: ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం భేటీ అయ్యారు.

Update: 2022-03-14 16:13 GMT

దిశ, భువనగిరి రూరల్: ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం భేటీ అయ్యారు. అనంతరం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రధాని అపాయింట్మెంట్ కోరగా అరగంటలోనే వచ్చిందని తెలిపారు. తెలంగాణ సమస్యలు అడిగి తెలుసుకున్నారని పేర్కొన్నారు. మూసి నదిలో నీరు శుద్ధి చేయకుండా కింది కి వెళ్లడం వలన ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొందరు చనిపోతున్నారని ప్రధానికి తెలిపినట్లు వివరించారు.

నమామి గంగ తరహాలో మూసినది ప్రక్షాళన చేయాలని కోరినట్లు తెలిపారు. హైదరాబాద్ నుంచి విజయవాడ హైవే 6 లైన్ నిర్మాణం పై చర్చించామని పేర్కొన్నారు. నాలుగు లక్షల కోట్లు అప్పు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మూసి ప్రక్షాళన చేయలేకపోయిందా అని మోడీ ఆశ్చర్యం వ్యక్తం చేశారని కోమటిరెడ్డి తెలిపారు. తెలంగాణలో మైనింగ్ కుంభకోణం జరుగుతున్నదనే విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లగా, చర్యలు తీసుకుంటామని చెప్పారన్నారు. ఏ రంగాల్లో అవినీతి జరుగుతున్నదో ప్రధాని అడిగి తెలుసుకున్నారని, తెలంగాణ పై దృష్టి పెడతామని అన్నట్లు తెలిపారు.

హైవే నిర్మాణంపై నేడు రివ్యూ

2022 ఏప్రిల్ లో హైదరాబాద్ – విజయవాడ హైవే నిర్మాణం ప్రారంభించాల్సి ఉండగా జీఎంఆర్ సంస్థ ఆర్బిట్రేషన్ కు వెళ్లి మొండిగా వ్యవహరిస్తున్నదని ఎంపీ కోమటిరెడ్డి తెలిపారు. 2025లో నిర్మిస్తామని చెబుతున్నదని, ఈ విషయాన్ని గడ్కరీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. మంగళవారం హైవే నిర్మణం పై రివ్యూ చేస్తున్నట్లు గడ్కరీ తెలిపారన్నారు. జీఎంఆర్ నిర్మింకపోతే కొత్త సంస్థతో పనులు చేపడుతామని, అవసరమైతే కోర్టుకు కూడా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని గడ్కరీ అన్నట్లు తెలిపారు.

Tags:    

Similar News