ప్రమాణ స్వీకారానికి ప్రతి ఒక్క పంజాబీకి ఆహ్వానం

ఛంఢీగఢ్: పంజాబ్‌లో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్‌కు latest telugu news..

Update: 2022-03-12 10:29 GMT

ఛంఢీగఢ్: పంజాబ్‌లో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్‌కు కాబోయే సీఎం భగవంత్ మాన్ అధికారిక పత్రాన్ని సమర్పించారు. శనివారం ఉదయం రాజ్‌భవన్ చేరుకున్న ఆయన, గవర్నర్‌ను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. స్వాతంత్ర ఉద్యమ కారుడు భగత్ సింగ్ పూర్వీకుల గ్రామంలో బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిపారు. 'ఈ వేడుకలకు పంజాబ్‌లోని ప్రతి ఇంటి నుంచి రావాలి.

భగత్ సింగ్‌కు నివాళులు ఆర్పించాలి. మేము మంచి మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేస్తాం. గతంలో తీసుకోనటువంటి చారిత్రక నిర్ణయాలు ప్రకటిస్తాం. అప్పటి వరకు ఎదురు చూడండి' అని అన్నారు. కాగా, ఎటువంటి తారతమ్యం లేకుండా ప్రజలకు సేవ చేయాలని ఆప్ ఎమ్మెల్యేలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ నెల 16న సీఎంగా భగవంత్ మాన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Tags:    

Similar News