Kaphoni Vasisthasana: కఫోని వశిష్టాసనం ప్రయోజనాలు తీసుకోవలసిన జాగ్రత్తలు?

Benefits Of Kaphoni Vasisthasana Yoga| ముందుగా సుఖాసనంలో కూర్చుని రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు వెల్లకిలా పడుకుని బాడీని సాగదీసేందుకు కొంచెం వార్మప్ చేయాలి. ఆ తర్వాత ఎడమ మోచేయిని కింద పెట్టి.. కుడి చేయిని పైకిలేపి సైడ్ భాగంలో ఉంటూ మోచేయిపై బాడీని బ్యాలెన్స్ చేయాలి

Update: 2022-07-21 04:31 GMT

దిశ, ఫీచర్స్: Benefits Of Kaphoni Vasisthasana Yoga| ముందుగా సుఖాసనంలో కూర్చుని రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు వెల్లకిలా పడుకుని బాడీని సాగదీసేందుకు కొంచెం వార్మప్ చేయాలి. ఆ తర్వాత ఎడమ మోచేయిని కింద పెట్టి.. కుడి చేయిని పైకిలేపి సైడ్ భాగంలో ఉంటూ మోచేయిపై బాడీని బ్యాలెన్స్ చేయాలి. ఈ పొజిషన్‌లో రెండు పాదాలు దగ్గరగా ఉండాలి. బాడీ భూమికి టచ్ కాకుండా కొద్దిగా లేపాలి. తర్వాత కుడి పాదాన్ని ఎడమ పిక్కపై వృక్షాసనం మాదిరిగా పెట్టాలి. నడుముపై కుడి చేయిని ఆన్చాలి. భుజం, ఛాతి, నడుమును ఎంతపైకి తీసుకెళ్లగలిగితే అంతపైకి తీసుకెళ్లి.. కొంత సమయం పాటు ఈ ఆసనంలో ఉండాలి. తర్వాత కుడి మోచేయిని కింద పెట్టి ఆసనం చేయాలి.

ప్రయోజనాలు :

* భుజం, వీపు పైభాగం స్ట్రాంగ్ అవుతుంది.

* పొట్ట కండరాలు దృఢంగా మారతాయి.

జాగ్రత్తలు :

* భుజాలు, మోచేయి, మెడ వీక్‌గా ఉన్నవారు జాగ్రత్త వహించాలి.

* సర్వైకల్ పెయిన్ ఉన్నవారు ఈ ఆసనం చేయకూడదు.

* పొట్టను బిగించి పెట్టే శక్తి లేనప్పుడు ఆసనం చేస్తే నడుము నొప్పి అధికమవుతుంది.

ఇది కూడా చదవండి: పూర్ణా శలభాసనం ప్రయోజానాలేంటి?

Tags:    

Similar News