Bakasana Yoga: బకాసనం ప్రయోజనాలేంటి?

Benefits of Bakasana Yoga| ఈ ఆసనంలో ముందుగా బల్లపరుపు నేలపై రిలాక్స్ పొజిషన్‌లో కూర్చోవాలి. తర్వాత రెండు కాళ్లను మోకాళ్ల దగ్గర మడిచి పాదాలను కలపాలి. ఇప్పుడు రెండు మోకాళ్లను చేతుల కిందుగా చంకలకు దగ్గరగా తీసుకురావాలి

Update: 2022-07-23 05:54 GMT

దిశ, ఫీచర్స్: Benefits of Bakasana Yoga| ఈ ఆసనంలో ముందుగా బల్లపరుపు నేలపై రిలాక్స్ పొజిషన్‌లో కూర్చోవాలి. తర్వాత రెండు కాళ్లను మోకాళ్ల దగ్గర మడిచి పాదాలను కలపాలి. ఇప్పుడు రెండు మోకాళ్లను చేతుల కిందుగా చంకలకు దగ్గరగా తీసుకురావాలి. చేతులను ముందుగా నిటారుగా చాచి ఉంచాలి. శరీరం బరువు పూర్తిగా పిరుదులపైనే వేసి తొడలు పొట్టకు ఆనుకుని, పాదాలు గాల్లో ఉంచాలి. ఇలా కాసేపు ఆగిన తర్వాత కాళ్లను ముందుకు చాపాలి. శరీరాన్ని వెనకకు నేలవైపుకు వంచాలి. అయితే ఇక్కడ కాళ్లు, శరీరం నేలమీద ఆన్చకుండా పిరుదులపైనే బాడీని బ్యాలెన్స్ చేయాలి. ఇలా కాసేపు ఆగి మళ్లీ కాళ్లు, శరీరాన్ని దగ్గరకు ముడుస్తూ మళ్లీ చాపాలి. మొత్తంగా ఇలా 20 లేదా సాధ్యమైనన్ని సార్లు చేసి రిలాక్స్ అవ్వాలి.

ప్రయోజనాలేంటి?

* గ్లూట్ మజిల్స్, అడిక్టర్స్‌ను స్ట్రాంగ్‌గా మారుస్తుంది.

* మణికట్టును మరింత బలోపేతం చేస్తుంది.

* వీపు, గజ్జలు, కండరాలను సాగదీస్తుంది.

* వెన్నెముకకు మంచి వ్యాయమ.

ఇది కూడా చదవండి: అశ్వ సంచలనాసనం ఎలా చేయాలి ప్రయోజనాలేంటి?

Tags:    

Similar News