హోలీ ఆడిన తర్వాత ఇలాచేస్తే.. అందం మీ సొంతం
దిశ, ఫీచర్స్: కలర్‌ఫుల్ మెమొరీస్, హ్యాపీయెస్ట్ మూమెంట్స్‌కే కాదు చెరపలేని మరకలకైనా
దిశ, ఫీచర్స్: కలర్‌ఫుల్ మెమొరీస్, హ్యాపీయెస్ట్ మూమెంట్స్‌కే కాదు చెరపలేని మరకలకైనా కేరాఫ్ అడ్రస్ 'హోలి' ఫెస్టివల్. అయితే ఆ రోజు వరకు ఆనందాన్నిచ్చే మరకలు.. మరునాడు మాత్రం మనసును కాస్త కష్టపెడతాయి. మరీ ముఖ్యంగా ఒంటిపై పేరుకుపోయిన రంగులు.. చర్మ కాంతిని, మృదుత్వాన్ని కోల్పోయేలా చేస్తాయి. అందుకే కలర్స్‌లో మునిగితేలే ముందే కార్యాచరణ రూపొందించుకోవాలి. లేదంటే మీ స్కిన్ తాత్కాలికంగా కోమలత్వా్న్ని కోల్పోయే అవకాశముంది. ఈ మేరకు హోలి తర్వాత మీ చర్మ సహజ స్థితిని తిరిగి పొందేందుకు మూడు సులభమైన పద్ధతులు మీ కోసం..
చర్మాన్ని సరైన పద్ధతిలో శుభ్రపరచాలి..
చర్మంపై నిలిచిపోయిన రంగులను తొలగించేందుకు ముందుగా జెంటిల్ క్లెన్సింగ్ బామ్‌ను ఉపయోగించాలి. ఆ తర్వాత స్కిన్ పోర్స్(చర్మ రంధ్రాలు)లో ఉండిపోయిన కలర్‌ను శుభ్రపరిచేందుకు ఆయిల్- బేస్డ్ క్లెన్సర్‌ను యూజ్ చేయాలి. ఫైనల్‌గా చర్మాన్ని పూర్తిగా శుభ్రపరిచి, అవశేషాలను తొలగించేందుకు రెగ్యులర్ ఫేస్ వాష్‌ను వినియోగించాలి.
ఫేస్ మాస్క్ అప్లయ్ చేయాలి
ముఖాన్ని చల్లటి నీటితో కడిగిన తర్వాత చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే రివైటలైజింగ్ ఫేస్ మాస్క్‌ను అప్లయ్ చేయాలి. స్కిన్‌పై ఉండిపోయిన రంగు మరకల అవశేషాలను తొలగించేందుకు ముల్తానీ మట్టి, రోజ్ వాటర్ మిశ్రమంతో కూడిన ఫేస్ మాస్క్‌ను ఎంచుకోవడం మంచిది. దాదాపు15 నుంచి 20 నిమిషాలు అలాగే ఉంచి.. చల్లటి నీటితో శుభ్రపరచాలి. ఒకవేళ పొడి చర్మం అయితే కొబ్బరి పాలను యాడ్ చేస్తే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి.
హైడ్రేటింగ్ టోనర్, సీరమ్ అప్లయ్ చేయాలి
ఫేస్ మాస్క్ రిమూవ్ చేసిన తర్వాత.. చర్మం తేమ స్థాయిని పునరుద్ధరించడానికి హైడ్రేటింగ్ టోనర్, బ్రైటెనింగ్ సీరమ్ ఉపయోగించాలి. మాయిశ్చర్ లెవల్ కోల్పోకుండా ఉండేందుకు సరైన ఫేస్ ఆయిల్‌తో మసాజ్ చేయాలి. ఇలా చేయడం వలన హోలి రంగుల కారణంగా కోల్పోయిన స్మూత్ అండ్ గ్లోయింగ్ స్కిన్.. హండ్రెడ్ పర్సెంట్ తిరిగి సొంతం చేసుకున్నట్లే.