ఇంధనం లేకుండా నడిచే రైలు వచ్చేస్తోంది!

దిశ, ఫీచర్స్ : స్టీమ్ ఇంజన్ నుంచి బుల్లెట్ ట్రైన్ వరకు 'సామాన్యుడి రథం'గా పేరుగాంచిన 'రైలు గాడి'..latest telugu news

Update: 2022-03-09 08:04 GMT

దిశ, ఫీచర్స్ : స్టీమ్ ఇంజన్ నుంచి బుల్లెట్ ట్రైన్ వరకు 'సామాన్యుడి రథం'గా పేరుగాంచిన 'రైలు గాడి' ఎప్పటికప్పుడు కొత్తగా ఆవిష్కారమవుతూ.. అప్రతిహితంగా సాగిపోతోంది. ప్రస్తుతం ఎలాంటి ఇంధనం అవసరం లేకుండా స్వయంగా దానికదే చార్జ్‌ అవుతూ పరుగులు పెట్టే రైలు వచ్చేస్తోంది. బొగ్గు, డీజిల్ అవసరం లేకుండానే కేవలం గురుత్వాకర్షణ శక్తితో నడిచే 'ఇన్ఫినిటీ రైలు' మరో కొత్త చరిత్ర సృష్టించనుంది.

ఆస్ట్రేలియాకు చెందిన మైనింగ్ కంపెనీ ఫోర్టెస్క్యూ రూపొందిస్తున్న 'ఇన్ఫినిటీ ట్రైన్' ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్లేటప్పుడు గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించుకుని ఆటోమేటిక్‌గా చార్జ్ అవుతుంది. 244 బోగీలుండే ఈ రైలును ఇనుప ఖనిజాన్ని తరలించడానికి రూపొందించగా, తక్కువ సమయంలోనే రవాణాకు ఉపయోగపడేలా దీన్ని నిర్మించారు. ఈ రైలు వల్ల ఎటువంటి కాలుష్యం ఉండకపోగా, ఇది పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి అవసరాన్ని తొలగించడం విశేషం.

ప్రస్తుతం కొన్ని కార్లలో బ్రేక్‌ వేసినప్పుడు వాటికవే రీచార్జ్‌ అయ్యే సాంకేతికతని వాడుతున్నారు. ఇదే సాంకేతికతని ఇప్పుడు ఇన్ఫినిటీ రైలులో ఉపయోగిస్తుండగా, ఈ రైలు ప్రపంచంలోనే అత్యుత్తమ, శక్తివంతమైన, సామర్థ్యం కలిగిన ఎలక్ట్రిక్ రైలుగా నిలుస్తుందనడంలో మాకు ఎలాంటి సందేహం లేదు. ఈ రైలు వల్ల డీజిల్ వాడకం తగ్గిపోతుంది. ఇది మా గ్రీన్-టెక్ ప్రాజెక్ట్‌లలో మొదటిది కాగా ఈ ఏడాది చివరి నాటికి ప్రపంచంలోని మొట్టమొదటి అమ్మోనియాతో నడిచే ఓడ, అలాగే హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్ మైనింగ్ ట్రక్స్, అమ్మోనియా-ఇంధన రైళ్లను ప్రారంభించే ప్రయత్నాల్లో ఉన్నాం. 2022 నాటికి అమ్మోనియా ఆధారిత ఇంధనంతో పని చేసే 246 అడుగుల నౌక(MMA లెవెక్యూ)ను రూపొందించేందుకు MMA ఆఫ్‌షోర్‌తో చేతులు కలిపాం. ఇక ఇన్ఫినిటీ రైలు 2030 నాటికి నెట్-జీరో ఉద్గారాలను చేరుకునేందుకు ఫోర్టెస్క్యూ రేసును వేగవంతం చేయడమే కాకుండా మా నిర్వహణ ఖర్చులను తగ్గిస్తుంది. అంతేకాకుండా నిర్వహణ సామర్థ్యాలు, ఉత్పాదకత అవకాశాలను సృష్టిస్తుంది.

                                                                                                                                                                                                                                                                   - డాక్టర్ ఆండ్రూ ఫారెస్ట్, ఫోర్టెస్క్యూ వ్యవస్థాపకుడు, చైర్మన్


గూగుల్ కొత్త టెక్నాలజీ.. స్కిన్ గెశ్చర్స్‌‌తో ఆపరేటింగ్

Tags:    

Similar News