- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గూగుల్ కొత్త టెక్నాలజీ.. స్కిన్ గెశ్చర్స్‌తో ఆపరేటింగ్
దిశ, ఫీచర్స్ : చర్మ సంకేతాలకు(స్కిన్ సైన్స్) ప్రతిస్పందించగలిగే యాక్సెసరీస్‌ను టెక్ దిగ్గజం Google అభివృద్ధి చేస్తోంది. ఈ మేరకు కొత్తగా Alphabet Inc టెక్నాలజీ పేటెంట్ పొందిన గూగుల్.. త్వరలోనే స్మార్ట్‌వాచెస్, ఇయర్‌బడ్స్ వంటి ఉపకరణాలను స్కిన్ సైన్స్ ఉపయోగించి నియంత్రించేందుకు గాను త్వరలోనే యూజర్లకు అనుమతించనుంది.
స్కిన్ ఇంటర్‌ఫేస్ :
ఈ స్కిన్ ఇంటర్‌ఫేస్‌లో ప్రతీ యూజర్.. తమ యాక్సెసరీస్‌కు సంబంధించిన ఫంక్షన్స్ ప్రారంభించేందుకు వాటి సమీపంలోని చర్మాన్ని స్వైప్ చేయాల్సి(నొక్కడం) ఉంటుంది. ఉదాహరణకు ఇయర్‌బడ్స్ యూజ్ చేస్తున్నప్పుడు పాటను పాజ్ చేయాలనుకునే లేదా రివైండ్ చేయాలనుకున్న ప్రతీసారి.. కొత్త టెక్నాలజీ ప్రకారం డివైస్‌కు బదులు కేవలం చర్మంపై ప్రెస్ చేస్తే సరిపోతుంది.
ఎలా వర్క్ చేస్తుంది?
విజనరీ టెక్నాలజీ ఎలా పని చేస్తుందనన్న విషయంలో గూగుల్ అప్‌డేట్స్ ఇచ్చింది. ఈ స్కిన్ గెశ్చర్స్ ద్వార సృష్టించబడే యాంత్రిక తరంగాన్ని యాక్సెసరీస్‌లో పొందుపరిచిన సెన్సార్స్ క్యాప్చర్ చేస్తాయి. ఆ తర్వాత 'సెన్సార్ ఫ్యూ టెక్నాలజీ' అనేది సెన్సార్స్ నుంచి మూమెంట్ డేటాను కంబైన్ చేసి యాక్సెసరీస్‌కు ఇన్‌పుట్ కమాండ్ ఇస్తుంది. కాగా అప్పటికే డివైస్‌లో నిక్షిప్తం చేయబడిన సంకేతాలు, చర్మంపై ప్రతి స్వైప్ ఏ పనిని నిర్వర్తించాలో నిర్ణయిస్తాయి. దీంతో కాల్స్ లిఫ్టింగ్, వాల్యూమ్ అడ్జస్ట్‌మెంట్, సాంగ్స్ ప్లే తదితర ఫీచర్స్‌ను స్కిన్ సైన్స్ ద్వారానే ఆపరేట్ చేయొచ్చు.