మంత్రి పువ్వాడపై కేసు నమోదు చేయాలి.. బండి సంజయ్ డిమాండ్
దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం జిల్లాలో బీజేపీ నేత సాయి గణేశ్ ఆత్మహత్య సంచలనం సృష్టించించి. ఈ ఘటనతో ఖమ్మం జిల్లా అట్టుడుకుతోంది.
దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం జిల్లాలో బీజేపీ నేత సాయి గణేశ్ ఆత్మహత్య సంచలనం సృష్టించించి. ఈ ఘటనతో ఖమ్మం జిల్లా అట్టుడుకుతోంది. బీజేపీ - టీఆర్ఎస్ నేతలు పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకుంటుండటంతో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా.. ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. ఆదివారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నమ్మిన సిద్ధాంతం కోసం తెగించి కొట్లాడిన కార్యకర్త సాయి గణేశ్ అని అన్నారు. సాయి గణేశ్ పోరాటం మరువలేదని కొనియాడారు. బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. బీజేపీని చూసి టీఆర్ఎస్ నేతలు వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మరణ వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు. సీఎంవో ఆదేశాల వల్లే కేసు మంత్రిపై కేసు నమోదు చేయడం లేదని మండిపడ్డారు.