చదువుకోవాలని ఉంది... రోడ్డు వేయండి సార్ (వీడియో)
దిశ, కోటపల్లి: మండలంలో గత వారం కురిసిన భారీ వర్షాలకు ఏదులబంధం రోడ్డు పూర్తిగా...Bad Roads in Kotapalli
దిశ, కోటపల్లి: మండలంలో గత వారం కురిసిన భారీ వర్షాలకు ఏదులబంధం రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది. జన జీవనం ఎక్కడికక్కడ స్తంభించి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. రోజులు గడుస్తున్నా రోడ్డు మరమత్తులు చేపట్టకపోవడంతో ప్రజలు, రైతులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులు బుడి బుడి పలుకులతో ఈ రోడ్డు తెగి చాలా రోజులు అవుతుంది.. పాఠశాలకు వెళ్ళడానికి తీవ్ర ఇబ్బంది అవుతుంది... దయచేసి రోడ్డు బాగు చేయండి అంటూ చేతులు జోడించి వినమ్రతతో రాజకీయ నాయకులను, అధికారులను వేడుకుంటున్నా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
మండలంలో ప్రతి గ్రామంలో రెండు టీఆర్ఎస్ వర్గ రాజకీయం వల్ల రోడ్డు వేయడానికి ఒక వర్గంవారు వస్తే ఇంకో వర్గం వారు మోరాయించడంతో రోడ్డు పనులను పట్టించుకునే నాయకుడే లేకుండా పోయింది. ప్రతి నాయకుడు మాటలు చెప్పే వాడే కానీ తమ కష్టాలను పట్టించుకునే నాథుడే లేడని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వర్గ రాజకీయాలు వదిలి ఏదులబంధం రోడ్డు మరమత్తులు చేపట్టి 12 గ్రామాల ప్రజల కష్టాలు తీర్చాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు.