Mechanic Rocky : విశ్వక్ సేన్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ .. మెకానిక్ రాకీ సినిమా పోస్ట్ పోన్

మెకానికా రాకీ సినిమా పోస్ట్ పోన్

Update: 2024-10-15 11:20 GMT

దిశ, వెబ్ డెస్క్ : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ సినిమాతోనే హిట్ కొట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవలే 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ హీరో ఇప్పుడు 'మెకానిక్ రాకీ' అంటూ అతి త్వరలో మన ముందుకు రాబోతున్నాడు. రవితేజ ముళ్లపూడి డైరెక్షన్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, పాటలు సినిమాపై అంచనాలును పెంచాయి. తాజాగా, ఈ మూవీ పోస్ట్ పోన్ అయినట్లు తెలుస్తుంది. ముందు ఈ సినిమాని దీపావళి కానుకగా అక్టోబర్ 31 న విడుదల చేయాలనీ మూవీ మేకర్స్ భావించారు. ఇప్పుడు రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 22న ఈ మూవీ ఆడియెన్స్ రానుందని వెల్లడించారు. అలాగే అక్టోబర్ 20న సినిమా ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్టు చిత్ర బృందం తెలిపింది.

Tags:    

Similar News