డ్రైనేజీ పాలైన చిన్నారి.. ఈ పాపం ఎవరిదో

దిశ ఉప్పల్ : డ్రైనేజీలో పసికందు మృతదేహం కలకలం సృష్టిస్తోంది. ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో

Update: 2022-03-11 07:07 GMT

దిశ ఉప్పల్ : డ్రైనేజీలో పసికందు మృతదేహం కలకలం సృష్టిస్తోంది. ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో చిలుకనగర్ డివిజన్ మల్లికార్జున్ నగర్‌లో చిన్నారి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. మల్లికార్జున్ నగర్‌లో మున్సిపాలిటీ సిబ్బంది డ్రైనేజీ క్లీన్ చేస్తుండగా, అకస్మాత్తుగా 7 నెలల పసికందు బయటపడింది. దీంతో స్థానికులు ఉప్పల్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు పసికందు మృతదేహాన్ని తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ ఘటన ఉప్పల్ నియోజక వర్గంలో కలకలం రేపుతోంది. చిన్నారి మృతదేహాన్ని చూసిన వారందరూ.. ఎవరు ఈ పని చేశారు, ఈపాపం ఎవరిదంటూ ముచ్చటిస్తున్నారు.

Tags:    

Similar News