Ashwa Sanchalanasana: అశ్వ సంచలనాసనం ఎలా చేయాలి ప్రయోజనాలేంటి?
Ashwa Sanchalanasana Yoga Benefits| ఈ ఆసననంలో మొదటగా బల్లపరుపు నేలపై నిలబడి రిలాక్స్ అవ్వాలి. తర్వాత నడుమును ముందుకు వంచుతూ రెండు అరచేతులను నేలపై ఆన్చాలి. ఇప్పుడు శరీర బరువును పూర్తిగా చేతులపై పెట్టి రెండు కాళ్లను వెనకకు చాచాలి
దిశ, ఫీచర్స్: Ashwa Sanchalanasana Yoga Benefits | ఈ ఆసననంలో మొదటగా బల్లపరుపు నేలపై నిలబడి రిలాక్స్ అవ్వాలి. తర్వాత నడుమును ముందుకు వంచుతూ రెండు అరచేతులను నేలపై ఆన్చాలి. ఇప్పుడు శరీర బరువును పూర్తిగా చేతులపై పెట్టి రెండు కాళ్లను వెనకకు చాచాలి. తర్వాత కుడి కాలును మోకాలు దగ్గర మడిచి కుడి పాదాన్ని కుడి అరచేతి దగ్గరకు తీసుకురావాలి. కుడి మోకాలు కుడి భుజానికి దగ్గరగా ఉండేలా చూసుకోవాలి. ఎడమ కాలు పూర్తిగా బొటన వేలిపై ఉండాలి. తల ఆకాశంవైపు చూడాలి. ఇలా కాసేపు ఆగిన తర్వాత మళ్లీ ఎడమ కాలు ముందుకు, కుడి కాలు వెనక్కు జరపాలి.
ప్రయోజనాలేంటి?
* వెన్నెముకను బలపరుస్తుంది.
* కాలేయం పనితీరు, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
* మోకాలు, చీలమండలాన్ని బలపరుస్తుంది.
* శరీరంలోని ఉదర అవయవాలను ఉత్తేజపరుస్తుంది.
ఇది కూడా చదవండి: కఫోని వశిష్టాసనం ప్రయోజనాలు తీసుకోవలసిన జాగ్రత్తలు?