సాగిన పొట్ట, నిండైన వక్షోజాలు.. బిడ్డకు జన్మనిచ్చాక నటి న్యూడ్ షో

దిశ, సినిమా: ప్రముఖ అమెరికన్ మోడల్ అండ్ టెలివిజన్ ప్రెజెంటర్ అష్లే గ్రాహం ఆదర్శవంతమైన..latest telugu news

Update: 2022-04-26 08:36 GMT

దిశ, సినిమా: ప్రముఖ అమెరికన్ మోడల్ అండ్ టెలివిజన్ ప్రెజెంటర్ అష్లే గ్రాహం ఆదర్శవంతమైన పోస్ట్‌తో నెటిజన్స్ ముందుకొచ్చింది. ఇటీవల మాలచి, రోమాన్‌ అనే కవల పిల్లలకు జన్మనిచ్చిన ఆమె.. గర్భవతిగా ఉన్నప్పుడు పొందిన అనుభూతి, ఇబ్బందుల గురించి చెబుతూ పోస్ట్ పెట్టింది. ఇద్దరు బేబీలను కడుపులో మోసేందుకు చివరి మూడు నెలలు చాలా కష్టపడ్డానన్న ఆమె.. డెలివరీ తర్వాత పొట్టమొత్తం మడతలు, మరకలతో ఇలా తయారైందంటూ బాత్ రూమ్‌లో అద్దం ముందు నిలబడి న్యూడ్ పిక్ షేర్ చేసింది.

ఈ క్రమంలో సాగిన పొట్ట, పాలతో నిండిన వక్షోజాలు, బిడ్డలకు పాలిస్తున్న ఫొటోలపై నెగెటివ్ కామెంట్లు చేశారన్న ఆమె.. 'నా బిడ్డలకు బలమైన ఆహారం అందిస్తున్నాను. దీనికి ఎవరికీ సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా వక్షోజాలు నిరంతరం పిల్లలకు పాలివ్వమని గుర్తుచేశాయి' అని చెప్పింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌పై సెలబ్రిటీలు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తూ.. 'మీరు ఆదర్శవంతమైన గొప్ప తల్లిగా చరిత్రలో నిలిచిపోతారు' అంటున్నారు.


ఈ అందాల విందుకు హద్దే లేదా.. చీరలో మెరిపోతున్న సింగర్ సునీత



Similar News