Ashika Ranganath: ‘మిస్ యు’ అంటున్న ఆషిక రంగనాథ్.. నెట్టింట పోస్ట్ వైరల్

యంగ్ బ్యూటీ ఆషిక రంగనాథ్(Ashika Ranganath) తెలుగులో వరుస ఆఫర్లు అందుకుంటూ క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది.

Update: 2024-11-22 13:56 GMT
Ashika Ranganath: ‘మిస్ యు’ అంటున్న ఆషిక రంగనాథ్.. నెట్టింట పోస్ట్ వైరల్
  • whatsapp icon

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ ఆషిక రంగనాథ్(Ashika Ranganath) తెలుగులో వరుస ఆఫర్లు అందుకుంటూ క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. స్టార్ హీరోల సరసన నటిస్తూ తన పాపులారిటీ పెంచుకుంటోంది. ప్రజెంట్ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘విశ్వంభర’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాతో పాటు ఆషిక రంగనాథ్, హీరో సిద్ధార్థ్(Siddharth) జంటగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మిస్ యు’(Miss you).

కోలీవుడ్ డైరెక్టర్ రాజశేఖర్(Rajasekhar) తెరకెక్కించిన ఈ సినిమా నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో.. వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు మూవీ టీమ్. ఇక ఆషిక రంగనాథ్ సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతూ అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంటోంది. తాజాగా, ఈ అమ్మడు ఇన్‌స్టా ద్వారా ఓ పోస్ట్ పెట్టింది. ‘‘ఈ నవ్వులన్నీ ప్రమోషన్స్ మొదటి రోజునవి. మిస్ యు నవంబర్ 29న రాబోతుంది’’ అంటూ కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఇక ఈ పోస్ట్‌ను చూసిన నెటిజన్లు ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.

Tags:    

Similar News