లక్నో: బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన రాముడి వారసుడేనని పేర్కొన్నారు. ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. 'ఒవైసీ నాకు పాత మిత్రుడు. నాకు తెలిసినంతవరకు ఆయన క్షత్రియుడు. ఆయన రామునికి వారసుడు. ఇస్లాంకు చెందిన వ్యక్తి కాదు' అని అన్నారు.
ఎస్పీ చీఫ్ అఖిలేష్‌పై విమర్శలు చేశారు. ముస్లిం కమ్యూనిటీ ఓట్ల కోసం అఖిలేష్, ఒవైసీ లు కొట్టుకుంటున్నారని విమర్శించారు. 'అఖిలేష్ ఓ మోసగాడు. ఆయన తన తండ్రి, బాబాయికి ద్రోహం చేశారు. ఆయన మోసం చేయడం అలవాటు. స్వామి ప్రసాద్ మౌర్యకు కూడా సీట్లు ఇస్తానని చెప్పి మోసగించారు' అని అన్నారు. కాగా, ఈ మధ్యనే ఎస్పీ లో చేరిన స్వామి ప్రసాద్ ఫజిల్ నగర్ నుంచి బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఏడు విడతల్లో జరిగే యూపీ ఎన్నికల్లో ఇప్పటికే రెండు దశలు పూర్తయ్యాయి.