Arvind Kejriwal: 'నేను నేరస్తుడిని కాదు'.. సింగపూర్ పర్యటనకు అనుమతివ్వండి

Arvind Kejriwal Urges Permission from Central Government to his Singapore trip| సింగపూర్ అంతర్జాతీయ సదస్సుకు వెళ్లేందుకు కేంద్రం తనకు అనుమతి ఇవ్వాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ మరోసారి ప్రభుత్వాన్ని కోరారు. తాను నేరస్తుడిని కాదని అన్నారు. తనకు అనుమతి ఇవ్వకపోవడం

Update: 2022-07-18 11:40 GMT

న్యూఢిల్లీ: Arvind Kejriwal Urges Permission from Central Government to his Singapore trip| సింగపూర్ అంతర్జాతీయ సదస్సుకు వెళ్లేందుకు కేంద్రం తనకు అనుమతి ఇవ్వాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ మరోసారి ప్రభుత్వాన్ని కోరారు. తాను నేరస్తుడిని కాదని అన్నారు. తనకు అనుమతి ఇవ్వకపోవడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని చెప్పారు. సోమవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. సింగపూర్‌లో జరిగే 'వరల్డ్ సిటీస్ సమ్మిట్'ని సందర్శించే అవకాశం రావడం దేశానికి గర్వకారణమని ఉద్ఘాటించారు. సింగపూర్ ప్రభుత్వం తనను సమావేశానికి ఆహ్వానించిందని, అక్కడ ఢిల్లీ మోడల్ గురించి ప్రపంచ నేతలకు వివరిస్తానని కేజ్రీవాల్ చెప్పారు.

అయితే తనను సమావేశం వెళ్లకుండా అడ్డుకోవడం వెనుక కారణమెంటో స్పష్టత లేదని తెలిపారు. అయితే అంతర్గత బేధాలు అంతర్జాతీయ వేదికపై ప్రతిబింబించొద్దని అన్నారు. ఈ విషయమై తన పర్యటనకు అనుమతివ్వాలని ప్రధానికి లేఖ రాసినట్లు చెప్పారు. కాగా, గత నెలలో కేజ్రివాల్ ను సింగపూర్ హైకమీషనర్ సైమన్ వాంగ్ సమావేశానికి అహ్వానించారు. మరికొన్ని రోజుల్లో ఈ సమావేశం ప్రారంభం కానుంది. మరోవైపు ప్యాక్ చేసిన, లేబుల్ ఆహార పదార్థాలపై తాజాగా జీఎస్టీ విధించడాన్ని కేజ్రివాల్ తప్పుబట్టారు ప్రభుత్వం వెంటనే దీనిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: రాష్ట్రపతి ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం.. ముర్ముకు విపక్ష ఎమ్మెల్యే ఓటు

Tags:    

Similar News