Arvind Kejriwal: ఢిల్లీ డిప్యూటీ సీఎంపై సీబీఐ విచారణ!
Arvind Kejriwal Says, we are followers of Bhagat Singh Not Scared of jail| కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆప్ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ విధానపరమైన లోపాలపై సీబీఐ విచారణకు సిఫార్సుల నేపథ్యంలో సీఎం కేజ్రివాల్ స్పందించారు
న్యూఢిల్లీ: Arvind Kejriwal Says, we are followers of Bhagat Singh Not Scared of jail| కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆప్ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ విధానపరమైన లోపాలపై సీబీఐ విచారణకు సిఫార్సుల నేపథ్యంలో సీఎం కేజ్రివాల్ స్పందించారు. తాము జైలుకు వెళ్లడానికి భయపడమని అన్నారు. ఆప్ నేతలు దేశ కోసం ప్రాణాలచ్చిన భగత్ సింగ్ వారసులని ఎవ్వరికీ భయపడరని అన్నారు. ఈ మేరకు ఎల్జీ నివేదికపై శుక్రవారం ఆయన ఘాటుగా స్పందించారు. తాము బ్రిటిషు వారిని క్షమాపణ కోరిన వీర్ సావర్కర్‌ను అనుసరించమని తేల్చి చెప్పారు. ఉద్దేశ్యపూర్వకంగానే డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై నకిలీ కేసు బనాయిస్తున్నారని అన్నారు. ఎల్జీ సక్సేనా కేంద్రప్రభుత్వ ఆదేశాల మేరకు పనిచేస్తున్నారని ఆరోపించారు.
తమ పార్టీ పాపులారిటీని అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ, ప్రధాని మోడీ పంజాబ్ ఎన్నికల్లో ఆప్ ప్రభుత్వం గెలవడం జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. ఆప్ ప్రభుత్వ లిక్కర్ పాలసీ ఉన్నత రాజకీయ స్థాయిలో గణనీయమైన ఆర్థిక సహాయాన్ని సూచిస్తుందని శుక్రవారం వెల్లడైన గవర్నర్ నివేదిక పేర్కొంది. కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రభుత్వ అత్యున్నత స్థాయి వ్యక్తులకు ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రైవేట్ మద్యం వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చే ఏకైక లక్ష్యంతో అమలు చేశారని లెఫ్టినెంట్ గవర్నర్ ఆరోపించారు. ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ ఇన్‌ఛార్జ్ మంత్రి మనీష్ సిసోడియా చట్టబద్ధమైన నిబంధనలు, నోటిఫైడ్ ఎక్సైజ్ పాలసీని ఉల్లంఘిస్తూ ప్రధాన నిర్ణయాలు తీసుకుని అమలు చేశారని నివేదికలో పేర్కొన్నారు. కాగా, కొత్త ఎక్సైజ్ పాలసీ 2021-22 గత ఏడాది నవంబర్ 17 నుండి అమలులోకి వచ్చింది. ఈ విధానాన్ని తప్పుబడుతూ బీజేపీ, కాంగ్రెస్ ఎల్జీ సక్సేనాను కలిసి కేంద్ర సంస్థలచే దర్యాప్తు ప్రారంభించాలని కోరాయి.
ఇది కూడా చదవండి: బీచ్‌లో అదిరిపోయిన ద్రౌపది ముర్ము సైకత శిల్పం..